సాధారంగా ఒక చిత్రానికి ఫుల్ లెన్త్ హీరోయిన్ గా నటిస్తే..స్టార్ హీరోయిన్లకు భారీగానే రెమ్యూనరేషన్ గిట్టుబాటు అవుతుంది.  తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో నటి రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.  క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో రకూల్ ప్రీత్ సింగ్ అలనాటి నటి శ్రీదేవి పాత్రలో నటిస్తుంది..దీనికి సంబంధించిన పోస్టర్ నిన్న రకూల్ పుట్టిన రోజు సంద్భంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  అంతే కాదు ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా..ఒకప్పటి ‘వేటగాడు’ చిత్రంలో ఆకుచాటు పిందె తడిసే పాటకు సంబంధించిన స్టిల్ కూడా రిలీజ్ చేశారు.   

నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ - శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకోసమే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఇచ్చారు.  అయితే శ్రీదేవి పాత్ర కోసం రకుల్ కి కోటి రూపాయలు ముట్టినట్టుగా తెలుస్తోంది.

తెలుగు .. తమిళ భాషల్లో రకుల్ కి మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలు కూడా చేస్తోంది. ఈ కారణంగానే ఆమెకి ఈ స్థాయి పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం.  మరోవైపు శ్రీదేవి పాత్రకు రకూల్ అంతబాగా సెట్ కాలేదని కొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు.  నటన పరంగా .. పాటల్లో డాన్స్ పరంగా శ్రీదేవిని రకుల్ గుర్తుకు తెస్తుందేమో చూడాలి. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: