హాలీవుడ్ లో భారీ స్థాయిలో మొదలైన ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు భారతీయ సినీ ఇండస్ట్రీపై కూడా పడింది.    భారతీయ సినీ, రాజకీయ రంగంలో ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తనుశ్రీ దత్తానానా పటేకర్ వివాదం నుంచి చిన్మయి శ్రీపాద, సోనా మహాపాత్ర సహా పలువురు నటీమణులు, గాయనీమణులు ముందుకొచ్చి లైంగిక వేధింపుల పర్వాన్ని బయట పెడుతున్నారు.   సినీ న‌టి గీతిక త్యాగితో జాలీ ఎల్ఎల్‌బీ ద‌ర్శ‌కుడు సుభాష్ క‌పూర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆమె అత‌ని చెంప ప‌గ‌ల‌గొట్టిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఎడ‌మ చేయి లేక‌పోయిన మంచి టాలెంట్‌తో అతను అద్భుత‌మైన చిత్రాలు తీస్తాడ‌నే పేరు ఆయ‌న‌కుంది.   


గుల్షన్ కుమార్ బయోపిక్ ను ఆమిర్ ఖాన్ కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కపూర్ 2014లో తనను లైంగికంగా వేధించినట్లు నటి గీతిక త్యాగి తాజాగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమిర్ దంపతులు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.  అమీర్ భార్యకిర‌ణ్ రావు మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లో ఇలాంటి అసాంఘిక ప‌నుల‌ని అస్స‌లు స‌హించం. ఇండ‌స్ట్రీ ఎప్పుడు సుఖంగా ఉండాల‌ని మేము కోరుకుంటాం. మా సంస్థ‌లో ప‌ని చేయ‌బోవు చిత్ర ద‌ర్శ‌కుడు చెడు ప‌నులు చేసాడ‌ని తెలిసి మేము అత‌నితో చిత్రం ఎలా తీస్తాం అని కిర‌ణ్ రావు అన్నారు.   మహిళలకు సురక్షిత, సంతోషకరమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆమిర్ అభిప్రాయపడ్డారు.


మీ టూ ఉద్యమం కారణంగా చిత్ర పరిశ్రమ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.  ఇదిలా ఉంటే..అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌కి వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌దులిచ్చాడు సుభాష్ కపూర్. అమీర్ ఖాన్, అతని భార్య కిర‌ణ్ రావు భావాల‌ని నేను గౌర‌విస్తాను. ఈ విష‌యం చ‌ట్ట విరుద్ధం కావ‌డంతో న్యాయ‌స్థానంలో నా అమాయ‌క‌త్వాన్ని నిరూపించుకోవాల‌ని భావిస్తున్నాను. కానీ నేను ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. నా అనుమ‌తి లేకుండా ఓ వీడియోని చిత్రీక‌రించి దానిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్ అని ప్రశ్నించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: