తెలుగు ఇండస్ట్రీలో కేవలం మూడు చిత్రాలతో స్టార్ హోదా సంపాదించాడు విజయ్ దేవరకొండ.  ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో నటించాడు.  ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ..తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు.  రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గీతాగోవిందం’ చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. దాంతో దర్శక, నిర్మాల ఫోకస్ మొత్తం విజయ్ పై పడింది. 


ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు.  విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మాతగా 'నోటా' తెరకెక్కింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, ఆ తరువాత నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కాగా,  తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూ.12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.  


పబ్లిసిటీతో పాటు ఇతర ఖర్చులకి మరో 4 కోట్లు ఖర్చు  అయినట్లు సమాచారం. అయితే విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ తో 12 కోట్లు ఇస్తామంటూ ఏపీ నుంచి  రూ. 4 కోట్లు ఇస్తామంటూ నైజామ్ నుంచి 2 కోట్లు ఇస్తామంటూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయట.  కానీ ఆ రేట్ కి తాను కాంప్రమైజ్ కానని చెప్పిన  జ్ఞానవేల్ రాజా .. చివరికి తానే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు.  కానీ, నోటా టాక్ బ్యాడ్ గా రావడంతో..ఆయనకి భారీ నష్టాలు వచ్చినట్టుగా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: