యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో అంచనాలకు తగినట్టుగా వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. కాస్త త్రివిక్రం మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది అన్నట్టు కనిపిస్తున్నా ఫైనల్ గా సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కలక్షన్స్ అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి.


తెలుగు రెండు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఆక్యుపెన్సీ సంపాదించగా ఓవర్సీస్ లో అరవింద సమేత హంగామా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ప్రీమియర్స్ తో వసూళ్ల సునామి సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటేసిందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ గత సినిమాలతో పోలిస్తే అరవింద సమేత ఎక్కువ కలక్షన్స్ రాబట్టిందని చెప్పొచ్చు.


ఓవర్సీస్ లో త్రివిక్రం సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. అందుకే ఆయన సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఇక స్టార్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత కూడా అక్కడ మంచి వసూళ్లను రాబెడుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించారు.


యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలను కూడా త్రివిక్రం తన మార్క్ చూపించాడని అనుకుంటున్నారు ఆడియెన్స్. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం చేసిన అరవింద సమేత మళ్లీ ఆయన స్టామినా ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద ఆధారపడ్డ బన్ని ఎంచక్కా త్రివిక్రం తో సినిమా చేసేందుకు రెడీ అవ్వొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: