నిన్న విడుదలైన ‘అరవింద సమేత’ సూపర్ హిట్ టాక్ తెచ్చు కోవడంతో ఈమూవీ హిట్ ఏరేంజ్ కలెక్షన్స్ ను తెచ్చుకుని రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.   ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమాలకు భిన్నంగా ఈమూవీ ఉంది అన్న కామెంట్స్ సగటు ప్రేక్షకుడి నుండి కూడ వస్తూ ఉండటంతో ఈ దసరా సీజన్ అంతా ‘అరవింద సమేత’ మ్యానియాతోనే కొనసాగే ఆస్కారం ఉంది. 
 225 థియేటర్లలో ప్రిమియర్ షో
సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలలో తొడగొట్టే సీన్స్ ఉండటం సర్వసాధారణం. అయితే ఈమూవీలో జూనియర్ పై తీసిన ఒకసీన్ ను త్రివిక్రమ్ ప్రజెంట్ చేసిన విధానం పై బాలకృష్ణ అభిమానులు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీలో త్రివిక్రమ్ ఒక కొత్త ఫార్ములాను కనిపెట్టి రక్తం అంటిన కత్తిని జూనియర్ తొడపై పెట్టించి తారక్ చేత డైలాగ్ చెప్పించడంతో బాలకృష్ణ ఫ్యాక్షన్ నటనకు త్రివిక్రమ్ స్టైల్ మార్చి ఏకంగా బాలయ్యకే పంచ్ వేసాడు అంటూ బాలయ్య అభిమానులు త్రివిక్రమ్ పై జోక్ చేస్తున్నారు. 
సెకండాఫ్ అనాలిసిస్
ఈసీన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘ఇన్నాళ్లు ఈమాస్ సీన్స్ ను ఎక్కడ దాచావ్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే త్రివిక్రమ్‌ బాలయ్యతో సినిమాను తీయకపోయినా బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల టెక్నిక్ ను చాల తెలివిగా కాపీ కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంటే ఈమూవీ ద్వారా త్రివిక్రమ్ రైటర్ గా అద్భుతంగా రాణించాడు కానీ దర్శకుడిగా అక్కడక్కడా తడబడ్డాడు అంటూ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ కోసం కొన్ని అత్యద్భుతమైన సంభాషణలను రాసిన త్రివిక్రమ్‌ ఆ సంభాషణలు వచ్చే సన్నివేశాల చిత్రీకరణ పై మరింత ఫోకస్ పెడితే ఈమూవీ ఈ సంవత్సరంలో వచ్చిన అద్భుతమైన సినిమాగా మారేది అని అంటూ ఈమూవీ పతాక సన్నివేశంలో ఎన్టీఆర్‌ జగపతిబాబు ముఖాముఖి సన్నివేశంలో ఉండాల్సినంత లోతు లేదు అంటూ విమర్శకుల కామెంట్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: