"టాలీవుడ్ బాక్సాఫీస్ బాద్ షా"  నందమూరి తారక రామారావు "అరవింద సమేత వీర రాఘవ" తో విద్వంసకర వసూళ్ళ వేట సాగిస్తున్నాడు. చిత్రంతో దక్షిణ భారత బాక్సాఫీస్‌ ను వణికిస్తున్నాడు. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో నిర్మించబడ్ద ఈ సినిమా భారీ అంచనాలతో నిన్న (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీకి ప్రేక్షకులు స్వాగతం పలకటమే కాదు బ్రహ్మరథం పడుతుండటం తో తొలి నుండే హిట్-టాక్‌ ను సొంతం చేసుకుని శరవేగంగా దూసుకుపోతుంది.
Image result for aravinda sametha photos
ఇక వసూళ్ళ విషయానికి వస్తే, అమెరికాలో ఒక రోజు ముందుగానే విడులైన ఈ మూవీ వసూళ్ళ వరదై పారుతూంది. ఎన్టీఆర్‌ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండటం, అమెరికాలో త్రివిక్రం సినిమాలకు ప్రత్యేక ప్రేక్షకులు భారీ ఎత్తున ఉండటంతో విజయం సింహనాధం చేస్తుంది. ఒక్క యూఎస్‌ లోనే 200పైగా స్క్రీన్‌ లలో ప్రిమియర్ షోలను ప్రదర్శించారు. 
Image result for aravinda sametha photos
ప్రముఖ యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వైనవి క్రియేషన్స్ ప్రకటించిన సమాచారం ప్రకారం 195 లొకేషన్లకు గానూ, 8 లక్షల డాలర్లకు చేరువైంది. అదనంగా మరో షో ఉండటంతో తొలిరోజే మిలియన్ మార్క్‌ ను అందుకోనున్నాడు ఎన్టీఆర్. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ కెరియర్‌ లోనే "హయ్యెస్ట్ గ్రాసర్" సాధించినట్టు నైజాం డిస్టిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అఫీషియల్‌ గా ప్రకటించారు.


టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు గత కొంత కాలంగా యూఎస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరవింద సమేత కూడా ఎవరు ఊహించని స్థాయిలో డాలర్ల వర్షం కురిపించటం దాదాపు ప్రీమియర్స్ ద్వారానే "బయ్యర్స్ సేఫ్ జోన్"లోకి వచ్చేశారని అంటున్నారు. ఇక చరిత్రలోకి వస్తే ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. జై లవకుశ $ 589219 లను అందుకోగా అరవింద సమేత ప్రీమియర్స్ ఇంకా పూతయ్యే సమాయానికే ఆ మార్క్ ని బ్రేక్ చేసింది.
Image result for aravinda sameta US collections at box office
త్రివిక్రమ్ సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ గురువారం రాత్రి 10 గంటల సమయానికి ప్రీమియర్స్ ద్వారా $689983 తో వసూళ్ళు చెలియలికట్తను దాటేశాయి. 194 లొకేషన్స్ లో ప్రీమియర్ షోలను ప్రదర్శించగా "ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్" గా నిలిచింది. 
Image result for aravinda sameta US collections at box office
ఈ సినిమా ఇక రంగస్థలం విధించిన $725000 మార్క్ ను చేధించటం అతి సులభం అని చెప్పవచ్చు. అలాగే భరత్ అనే నేను $850000 క్రియేట్ చేసిన వసూళ్ళ మార్క్ ను దాటితే అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూలు చేసిన ఆరవ తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కుతుంది. మరి ఈ బాద్ షా వసూళ్ళ సునామీని ఏ తీరం చేరుస్తాడో నని అభిమానులు సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: