‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ గా మారడంతో ఇప్పటి వరకు ఈమూవీ ఫలితం గురించి తనసినిమాల దర్శకుల ఎంపిక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చిన అల్లుఅర్జున్ ఒకస్థిర నిర్ణయం తీసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈసంవత్సరం మహేష్ చరణ్ జూనియర్ లకు సమానంగా వారునటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో  ఈలిస్టులో మిస్ అయింది ఒక్క బన్నీ మాత్రమే. ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు వచ్చిన ‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం చెందడంతో షాక్ లోకి వెళ్ళిపోయిన బన్నీ తన తదుపరి సినిమా గురించి విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఎన్నో కథలు వింటున్నాడు. 
Will New Offices Bring Luck to Bunny, Trivikram?
ఇలాంటి పరిస్థుతుల మధ్య ‘అరవింద సమేత’ విడుదలకు ముందు త్రివిక్రమ్ బన్నీల మధ్యజరిగిన ఒక సమావేశంలో త్రివిక్రమ్ బన్నీకి ఒక స్టోరీ లైన్ చెప్పినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆస్టోరీ లైన్ అల్లు అర్జున్ కు నచ్చడంతో ‘అరవింద సమేత’ హడావిడి అయిన తరువాత మళ్ళీ కలుద్దాం అంటూ అక్కడితో ఆవిషయాన్ని అటు బన్నీ ఇటు త్రివిక్రమ్ లు ముగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలి అంటే త్రివిక్రమ్ అల్లు కాంపౌండ్ షరతులకు తలఒగ్గుతాడా అన్నసందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
Allu Arjun to take a Bold Step for his Next
వాస్తవానికి త్రివిక్రమ్ కు బన్నీతో సినిమా చేయాలని అల్లుఅర్జున్ కు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఉభయలకు ఇష్టం ఉన్నా అనేకసమస్యలు ఈమూవీ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థుతులలో అల్లు అర్జున్ తన దర్శకులకు ఫ్రీడం ఇవ్వడం లేదు. దీనికితోడు ఇతదితో సినిమాలు తీస్తున్న దర్శకులకు అల్లుఅరవింద్ ప్రతి విషయంలోనూ కల్పించుకోవడం పెద్దసమస్యగా మారింది. 
Trivikram-srinivas-director.jpg
అదేవిధంగా త్రివిక్రమ్ బయట నిర్మాతల సినిమాలకు దర్శకత్వం వహించే ఉద్దేశ్యంలో లేడు. దీనితో ఎలాంటి టాప్ హీరోని అయినా తను భాగస్వామిగా కొనసాగుతున్న హారికా హాసిని ప్రొడక్షన్ హౌస్ లోనే నటించమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇలాంటి కండిషన్స్ కు బన్నీ ఒప్పుకోడు అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ‘అరవింద సమేత’ సక్సస్ అయినా అటు బన్నీ ఇటు త్రివిక్రమ్ లు తమ పట్టుదల విషయంలో కనీసం చెరొక మెట్టు దిగినప్పుడే వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందని లేకుంటే ఎప్పటికీ ఈకాంబినేషన్ సెట్ అవ్వకపోవచ్చు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: