ఈ రోజు శరన్నవరాత్రులలో మూడవరోజున చంద్రఘంటా దేవిగా దుర్గా మాతను పూజిస్తారు. ఈ రోజు అమ్మవారు శాంతంగా కనిపిస్తారు. కళ్యాణ ప్రదమైన తేజస్సుతో కూడిన ఈనాటి అమ్మవారి మస్తకం పై ఘంటాకారంలో అర్ధచంద్రుడు కనిపిస్తాడు.

ఈ రోజు ఆమె శరీరం అంతా స్వర్ణ మయంగా కనిపిస్తుంది. దశ హస్తాలు ఖడ్గాది శాస్త్రాలు బాణాది అస్త్రాలతో సింహవాహనం పై కనిపించే ఈమె రూపు ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. ఈ రోజు అమ్మను అర్చించే సాధకుడుకి అలౌకిక అనుభూతులు కలిగి దేవి మందిరమైన మణిద్వీపం లోని వివిధ ప్రాకార ద్వనులు సుగంధానుభవం సాధకుడుకి తెలిసి వచ్చేలా జరుగుతుంది. 

ఈ రోజు అమ్మవారి రూపు జ్ఞాన ముద్రతో కనిపిస్తుంది. భక్తుల కష్టాలను తీర్చడంలో శీఘ్రంగా స్పందించే దుర్గాదేవి ఘంటానాధం అనేక దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అని మన నమ్మకం. ఈ రోజు అమ్మవారిని ఉపాసించడం వల్ల మన శారీరక బాధలు అన్నీ నివారణ అయి మన కష్టాల నుండి విముక్తులు అవుదాం అన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. 

మనోవాక్కర్మలను నియంత్రించుకోవడంలో ఈరోజు చంద్రఘాంటా దేవి అవతారంలో ఉన్న అర్చించడం ద్వారా మన సంసారిక కష్టాల నుండి విముక్తి పొందుతాము. ఈ రోజు అమ్మవారికి ఎర్రటి పూలతో అర్చించి చక్కరపోంగలి ప్రసాదంగా నివేదన చేస్తారు. శ్రద్ధగా పూజించి అమ్మ అనుగ్రహం దీవెన పొందుదాం..



మరింత సమాచారం తెలుసుకోండి: