తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిని చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.   ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  భారీ యాక్షన్ సీన్. హై-ఓల్టేజ్ యాక్షన్. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఎలివేషన్. విలన్ గొంతులో హీరో మొండికత్తిని దించేస్తాడు. సినిమా ఓపెనింగ్ లోనే ఇంత యాక్షన్ ఉంటే, ఇక క్లయిమాక్స్ ఫైట్ అదిరిపోతుందని అంతా ఆశించారు.  కానీ అందరికీ ట్విస్ట్ ఇస్తూ..క్లయిమాక్స్ లో ఫైట్ లేకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు..కానీ దానికి అర్థం ఉందని కామ్ అయ్యారు.  కానీ ఈ విషయంపై దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం స్పందించారు. 

వాస్తవానికి మేం ముందు యాక్షన్ క్లైమాక్స్ అనుకున్నాం. దాన్ని డిజైన్ కూడా చేశాం..దాన్ని  చిత్రంలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం.  అయితే మొత్తం డిస్కషన్ లో అసలు క్లైమాక్స్ ఫైట్ వద్దని చెప్పింది ఫైట్ మాస్టర్లు. ఫైట్ కంటే కూడా డైలాగ్స్ తో వెళ్లడమే కరెక్ట్ అని వాళ్లు చెప్పారు. ఈ విషయంలో రామ్-లక్ష్మణ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. రామ్-లక్ష్మణ్ చెప్పిన ఐడియా వల్ల, ఫైట్ డిజైనింగ్ పూర్తయిన తర్వాత కూడా దాన్ని పక్కనపెట్టామని అంటున్నాడు. 

ఈ చిత్రం మనం ఓ పర్పస్ లో తీశామని..శాంతని ఆకాంక్షించేవారు ఇలాంటి వైలెన్స్ కి దూరంగా ఉండాలనేది చిత్రం అర్ధం. సాయంత్రం 6.30కి రామోజీ ఫిలింసిటీలో సిట్టింగ్ స్టార్ట్ చేశాం. చర్చిస్తూనే ఉన్నాం. రాత్రి 2.30 అయిపోయింది. శత్రు, బ్రహ్మాజీని షూటింగ్ కూడా లేకుండా కూర్చోబెట్టాను. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ చర్చ నడిచింది.   దర్శకుడిగా త్రివిక్రమ్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి.  భవిష్యత్ లో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటానని అన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: