యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా  మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వసూలు చేసింది. యూఎస్ లో ఈ చిత్రం మొదటిరోజు కలెక్షన్స్ 1 మిలియన్ మార్కును చేరుకుంది.  ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండటంతో ఒక్క యూఎస్‌లో 218పైగా స్క్రీన్‌లలో ప్రిమియర్ షోలను ప్రదర్శించారు.  వారం రోజులు ముందుగానే నందమూరి అభిమానులకు దసరా పండుగ వచ్చినట్టుంది తెలుగు రాష్ట్రాల కన్నా ఒకరోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్లు వేసేశారు.  అంత ఊహించినట్లే ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు.


త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన అరవింద సమేత అక్టోబర్ 11 న భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్మేసాయని సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్, ఆస్ట్రేలియాలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రముఖ మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రిమియర్ షో కలెక్షన్స్ వివరాలను తెలియజేశారు. యూఎస్ బుధవారం నాడు 218 లొకేషన్లలో విడుదలైన ఈ మూవీ $ 791,021 (రూ. 5.85 కోట్లు) రాబట్టినట్టు ట్వీట్ చేశారు. 


ఆస్ట్రేలియా బాక్సాఫీసు వద్ద ‘అరవింద సమేత’ తొలిరోజు 128,740 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.67.63 లక్షలు) వసూలు చేసినట్లు మూవీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో మొత్తం 35 లొకేషన్లలో ‘అరవింద సమేత’ ప్రదర్శితమవుతోంది. ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘అరవింద సమేత’ 9వ స్థానంలో నిలిచిందన్నారు.  తొలిరోజే నైజాంలో 5.73 కోట్ల షేర్ వ‌సూలు చేసింది "అర‌వింద స‌మేత‌". నాన్ "బాహుబ‌లి" రికార్డ్ ఇది.


ఇదివ‌ర‌కు ఈ రికార్డ్ ఎన్టీఆర్ "జ‌న‌తా గ్యారేజ్" పేరు మీద ఉన్న విషయం తెలిసిందే.  ఆ సినిమా 5.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది.. ఇప్పుడు "అర‌వింద స‌మేత" మ‌రో 23 ల‌క్ష‌లు అద‌నంగానే తెచ్చింది. ఈ ఏడాది వ‌చ్చిన "అజ్ఞాత‌వాసి" తొలిరోజు 5.48 కోట్లు వ‌సూలు చేసింది. "బాహుబ‌లి" కాకుండా "అర‌వింద స‌మేత" ఇప్పుడు అన్ని రికార్డులను దాటేసింది.  కృష్ణాలో కూడా ఏకంగా తొలిరోజే 2 కోట్ల 20 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడులోనూ రికార్డ్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. 


మొత్తంగా తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో "అజ్ఞాత‌వాసి" పేరు మీదున్న 26 కోట్ల షేర్ రికార్డ్ ఈజీగానే దాటేలా క‌నిపిస్తున్నాడు వీర‌రాఘ‌వుడు. ఓవ‌రాల్‌గా కూడా ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా సుల‌భంగా 35 కోట్ల షేర్ అందుకోవడం ఖాయ‌మైపోయింది.  ఇక దసరా వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేక పోవడంతో మరింత కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉందని..అంతా కలిసి వస్తే..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: