కేవలం మూడు సినిమాలతో స్టార్ హీరో ఇమేజ్ కి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ తన పై ప్రస్తుతం ఇండస్ట్రీలో పెరిగి పోయిన ఈర్ష్యను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అంటూ కొందరు విజయ్ సన్నిహితులు అతడికి సలహాలు ఇస్తున్నట్లు   టాక్. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తో విజయ్ దేవరకొండ మ్యానియా మొదలు అయితే ఈ మధ్యన వచ్చిన ‘గీత గోవిందం’ తో విజయ్ మ్యానియా తార స్థాయికి చేరిపోయింది.  
Vijay Devarakonda
ఇలాంటి పరిస్థితులలో  చిరంజీవి లాంటి స్టార్ హీరో, స్టార్ హీరోల క్లబ్ లోకి విజయ్ దేవరకొండకు స్వాగతం అంటూ ‘గీత గోవిందం’ సక్సస్స్ మీట్ లో  అన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరికి ఈర్షను కలిగించడంతో కొందరు పనిగట్టుకుని విజయ్ దేవరకొండను కిందకి లాగాలనే ప్రయత్నాలు చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నారు అన్నగాసిప్పుల హడావిడి తారా స్థాయికి చేరుకుంది.  ఈ ప్రయత్నాలకు అనుకూలంగా ‘నోటా’ ఫ్లాప్ కావడంతో విజయ్ వ్యతిరేక వర్గం తమ వ్యూహాలను మరింత వేగం పెంచినట్లు టాక్. 
Vijay Devarakonda
ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా విజయ్ తన పరాజయాన్ని అంగీకరిస్తూ తన మూవీ  ఫ్లాప్ ను చూసి కొందరు ఇండస్ట్రీలో పండుగ చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేయం విజయ్ అనుభవ రాహిత్యాన్ని సూచిస్తోంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా నిఖిల్  విజయ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్విట్ చేయడం దానికి సమాధానంగా విజయ్ తన  యాటిట్యూడ్ మారదు అంటూ కామెంట్స్ చేయడం విజయ్ కెరియర్ కు ఏమాత్రం మంచిది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం ఆతున్నాయి.
Vijay Devarakonda is now ready with Taxi Wala
ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం విజయ్ తన యాటిట్యూడ్ ను తగ్గించుకుంటే మంచిది అన్న కామెంట్స్ ను యంగ్ హీరోలు నాగ శౌర్య శర్వానంద్ లు తమ సన్నిహితుల వద్ద ఈమధ్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా టాప్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లు నుండి జూనియర్ మహేష్ ల వరకు వారి ప్రవర్తన విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఇలా తన యాటిట్యూడ్ మారదు  అంటూ తనకు తానే ఒక గొప్ప ఇమేజ్ ని తనకు తానుగా ఆపాధించుకోవడం విజయ్ దేవరకొండను వార్నింగ్ బెల్స్ దగ్గరకు తీసుకు వెళుతుంది అని కొందరి భావన..   


మరింత సమాచారం తెలుసుకోండి: