తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానిస్తారు.  సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, ఇప్పటి తరం హీరోలు జూ. ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు.  ఇక అచ్చం సీనియర్ ఎన్టీఆర్ రూపంతో జూ.ఎన్టీఆర్ కనిపిస్తారని అభిమానులు అంటుంటారు. స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. 

ఇక టెంపర్ చిత్రం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ నిన్న రిలీ్ అయిన ‘అరవింద సమేత’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  సాధారణంగా హీరోలు అంటే ప్రాణాలు ఇచ్చే అభిమాలు ఉంటారు.  తమ అభిమాన హీరో చిత్రం వస్తుందంటే..వారం రోజుల ముందే థియేటర్ల వద్ద హడావుడి చేస్తుంటారు.  ఈ మద్య ఫ్లెక్సీ రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ అభిమానం రోజు రోజు కీ ముదిరిపోతూనే ఉంది. 

 ఈ పిచ్చి ముదిరి త‌మ‌ను తాము హీరోలా అనున‌యించుకుంటున్నారు. ఎవ‌రేం అనుకుంటారు అనేది లేకుండా ఇప్పుడు ఓ ఫ్యాన్ ఇలాగే త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా అరవింద సమేత రిలీజ్  సంద‌ర్భంగా క‌ట్టిన ఫ్లెక్సీలో ఓ అభిమాని ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫాలో అవుతూ.. తాను కూడా అదే ఫోజ్ ఇచ్చాడు. 

అయితే ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తుంటే..సదరు ఫ్యాన్ మాత్రం ఫ్యామిలీ ప్యాక్ తో కనిపిస్తున్నాడు.   ఇప్పుడు అత‌న్ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ఏదేమైనా అభిమానం తమ హీరోలను తమలో చూసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది..ఈ ఫోటో ఎన్టీఆర్ ని క్రిటిసైజ్ చేసేందుకు కాదని..జస్ట్ ఫర్ ఫన్ కోసమే అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: