తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.  అంతే కాదు మెగా హీరో అంటే డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ పండించేలా ఉండాలనుకుంటారు ఫ్యాన్స్.  ఇలాంటి అర్హతలు ఉన్నాయి కనుకనే ఇప్పటి వరకు వచ్చిన హీరోలందరూ సక్సెస్ అయ్యారు.  కాకపోతే ఒక్క అల్లు శిరీష్ తప్ప.  ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రంతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సాయిధరమ్ తేజ్ తర్వాత వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’‘సుప్రీమ్’ చిత్రాలతో  మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ గత కొంత కాలంగా వరుసగా మనోడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడిపోయాయి. 

వ‌ర‌స ప్లాపులు ఉన్నా కూడా ఎందుకో తెలియ‌దు కానీ క్రేజీ ద‌ర్శ‌కులే వ‌చ్చి ఈ కుర్రాడికి అవ‌కాశాలు ఇచ్చారు. మెగా మేన‌ల్లుడు అనే బ్రాండ్ కూడా సాయికి చాలా రోజుల పాటు యూజ్ అయింది కూడా. అయితే ఒక‌టి రెండు అంటే ఓకే కానీ వ‌ర‌స‌గా ఆరు ఫ్లాపులు వ‌చ్చేస‌రికి ఆ బ్రాండ్ కూడా ఈయ‌న్ని కాపాడ‌లేక చేతులెత్తేస్తుంది. "ఇంటిలిజెంట్"తో పాటు "తేజ్ ఐ లవ్ యూ" కూడా డిజాస్ట‌రే. దీనికి ముందు "జ‌వాన్".. "న‌క్ష‌త్రం".. "విన్న‌ర్".. "తిక్క" కూడా దారుణ‌మైన ఫ్లాపులే.

సాయిధరమ్  సినిమాలు క‌నీసం 5 కోట్లు వ‌సూలు చేసే పరిస్థితిలో లేవు.  ప్రస్తుతం ఫారెన్ వెళ్లిపోయాడు. అక్క‌డే కొన్ని రోజులుగా ఉంటూ బ‌రువు త‌గ్గించుకోవ‌డంతో పాటు కిషోర్ తిరుమ‌ల‌తో క‌మిటైన "చిత్ర‌ల‌హ‌రి" సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఫుల్‌లెంత్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా "చిత్ర‌ల‌హ‌రి" తెర‌కెక్కనుంది.

"నేనుశైల‌జ‌".. "ఉన్న‌ది ఒక‌టే జందగీ" లాంటి సినిమాల త‌ర్వాత కిషోర్ తిరుమ‌ల చేస్తున్న సినిమా ఇది. మరి ఈ చిత్రమైనా మనోడికి మంచి సక్సెస్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టగలదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఇన్ని ప్లాపుల త‌ర్వాత కూడా ఉనికి చాటుకుంటున్నాడు మెగా మేన‌ల్లుడు. హిట్ వ‌స్తే మ‌ళ్లీ పోయిన మార్కెట్ తిరిగి రావ‌డం పెద్దవిష‌యం అయితే కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: