ఆలూ లేదు..చూలూ లేదు..కొడుకు పేరు..అదేదో అన్నట్లు..అసలు సినిమానే మొదలు పెట్టలేదు..అప్పుడే వివాదాలకు కేంద్రంగా మారిపోయింది...వెయ్యి కోట్లు బడ్జెట్ తో రూపొందబోతున్న ‘మహాభారతం’. ఈ మద్య భారీ బడ్జెట్ తో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, బాహుబలి 2 సినిమాలు భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు..అయితే ఆ రేంజ్ వసూళ్లు కూడా సాధించాయి.  ఇప్పుడు స్టార్ దర్శకులు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 కూడా దాదాపు నాలుగు వందల కోట్లతో నిర్మితమైందని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాలు ప్రధాన పాత్రలో ‘మహాభారతం ’ సినిమా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.  మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు శ్రీ కుమార్ ఈ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేశాడు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్ శెట్టి ఈ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాడు.  భీష్ముడి దృక్కోణంలో మహాభారతం ఆధారంగా ‘రండమూలం’ అనే నవల రాసిన వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించాడు. 

కాగా ఈ సినిమాకు  స్క్రిప్టు అందించి నాలుగేళ్లవుతోంది. కానీ ఇప్పటిదాకా ఈ చిత్రం పట్టాలెక్కనే లేదు. దాంతో ఆయన ఎంతో అసహనానికి గురి కావడంతో తాను ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేయడానికి సిద్ధపడ్డ ఆయన.. తన స్క్రిప్టు కూడా వెనక్కి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.ఐతే ఇప్పటికీ ఈ సినిమా మొదలే కాలేదని.. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదని.. అలాంటపుడు తన స్క్రిప్టు తనకు ఇచ్చేయాలని వాసుదేవన్ అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: