‘అరవింద సమేత. కలెక్షన్స్ విధ్వంసం నిన్న రెండవరోజున కూడ కొనసాగింది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈమూవీ 30కోట్లు నెట్ కలక్షన్స్ వసూలు చేసింది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈమూవీ ఇప్పటివకు ఉన్న నాన్ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయడంతో వచ్చే ఏడాది విడుదలకాబోతున్న చరణ్ మహేష్ ప్రభాస్ ల సినిమాల కలక్షన్స్ కు కొత్త కలక్షన్స్ టార్గెట్ ఫిక్స్ చేసినట్లు అయింది.
A still from the teaser
దీనితో మన టాప్ యంగ్ హీరోలు అంతా తమ సినిమాలకు సంబంధించి ‘అరవింద సమేత’ కలక్షన్స్ స్థాయిని మించి వారి సినిమాలకు కూడ అత్యంత భారీ కలక్షన్స్ వచ్చేవిధంగా తమవ్యూహాలు మార్చుకోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ‘అరవింద సమేత’ సృష్టించిన నాన్ ‘బాహుబలి’ రికార్డులు ప్రభాస్ ‘సాహో’ విడుదల అయ్యేదాకా కొనసాగుతాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
అన‌గ‌న‌గా ఓ
మన తెలుగు రాష్ట్రాలలోని కొన్నిప్రాంతాలలో ‘అరవింద సమేత’ మొదటిరోజు కలక్షన్స్ ‘బాహుబలి 2’ కలక్షన్స్ ను కూడ క్రాస్ చేసింది అనివార్తలు రావడం ఒకవిధంగా ప్రభాస్ కు టెన్షన్ కలిగించే న్యూస్. దీనితో ప్రభాస్ ‘సాహో’ ‘అరవింద సమేత’ మ్యానియాను మించి హైక్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల రికార్డులు అన్నీ బ్రేక్ చేయవలసిన పరిస్థితి ప్రభాస్ కు ఏర్పడింది. 
Latest Updates: Prabhas New Movie 'Sahoo'
‘బాహుబలి’ మూవీతో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ తన ‘సాహో’ ను ఒకేసారి దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడ వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. అయితే ‘అరవింద సమేత’ మూవీకి త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ క్రేజ్ కలిసి వస్తే ‘సాహో’ విషయంలో మాత్రం దర్శకుడు సుజిత్ యంగ్ డైరెక్టర్ కావడంతో అన్నీ తానై మోస్తూ కలక్షన్స్ రికార్డులను బ్రేక్ చేయవలసిన బాధ్యత ప్రభాస్ పై ఉంది. మూవీ బడ్జెట్ రీత్యా ‘అరవింద’ కంటే ఎంతో భారీ స్థాయిలో ‘సాహో’ పై ఖర్చు పెడుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ‘అరవింద సమేత’ క్రియేట్ చేసిన నాన్ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయవలసిన బాధ్యత ప్రభాస్ కు ఏర్పడిన నేపధ్యంలో ‘సాహో’ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభాస్ ఆలోచనలు మారుతున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: