ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కు ఇప్పుడు థియేటర్ లలో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. అన్ని వైపుల నుంచి ఈ  సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజున రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. పలు భారీ హీరోల చిత్రాల రికార్డులు అరవిందకు దాసోహం అన్నాయి. మొదటి ఆట నుంచే భారీ కలెక్షన్లు సాధిస్తూ నాన్ బాహుబలి క్యాటగిరిలో అతిపెద్ద విజయాన్ని అందుకొన్నది. బాహుబలి2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.


ఎన్టీఆర్ ఊచకోత .... ఒక్క రోజులో తెలుగు ఇండస్ట్రీ లో ఏ రికార్డులు బతకలేదు...!

ఎన్టీఆర్, పూజా హెగ్డే నటించిన అరవింద సమేత అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజున అరవింద సమేత చిత్రం రూ.28.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ ఊపు ఇలానే కొనసాగితే ఇక వారాంతంలో కూడా మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశం లేకపోలేదు. పవన్ కల్యాణ్ నటించిన అజాతవాసి 26.36 కోట్లు, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను రూ.21.74 కోట్లు, రాంచరణ్ నటించిన రంగస్థలం 19.49 కోట్లు, చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రం సాధించిన 22.40 కోట్ల తొలి రోజు వసూళ్లను అరవింద అధిగమించింది.


ఎన్టీఆర్ ఊచకోత .... ఒక్క రోజులో తెలుగు ఇండస్ట్రీ లో ఏ రికార్డులు బతకలేదు...!

రానున్న రోజుల్లో అరవింద వసూళ్లు సునామీలా ఉండవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో అరవింద సమేత కనక వర్షం కురిపిస్తున్నది. బుధవారం ప్రీమియర్ల ద్వారా $ 790,505 సాధించిన అరవింద సమేత.. గురువారం 196 లోకేషన్లలో 228115 డాలర్లను వసూలు చేసింది. రెండు రోజుల్లో 7.50 కోట్లు (: $ 1,018,620) వసూలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: