బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. విజేతగా గెలిచాక కౌశల్ చాదస్తం మరింత ఎక్కువైందని తెలుస్తుంది. ఎంతలా అంటే తను మాట్లాడే మాటలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్న విధంగా పరిస్థితులు కబడుతున్నాయి. 


బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక వరుస ఇంటర్వ్యూస్ చేస్తూ బిజీగా ఉన్న కౌశల్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఇస్తారని చెప్పడం.. పిఎం ఆఫీస్ నుండి కూడా తనకు కాల్ వచ్చినట్టు చెప్పాడు. ఇక ఒక ఫారిన్ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇచ్చేందుకు కాల్ చేశారని చెప్పాడు. అసలు ఏం గనకార్యం చేశాడని కౌశల్ కు ఇంతమంది ఎందుకు ఫోన్ చేసి ఉన్నాడని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


కౌశల్ నీ సుత్తి ఆపుతావా.. ఏం చేశావని వారందరూ నీకు కృతజ్ఞతలు తెలుపుతారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదవరకు కాస్త కౌశల్ మీద అభిమానం చూపిన ప్రేక్షకులు సైతం వీడేంట్రా బాబు అంటూ విసుక్కునే పరిస్థితి వచ్చింది. అసలు కౌశల్ చెప్పేవన్ని నిజాలేనా లేదంటే తనకు ఎంత గాలి పోతుంది అన్నది ఆలోచించాలి. 


ఇక మరోపక్క కౌశల్ కు తాము ఫోన్ చేసినా సరే అటెండ్ చేయట్లేదు అంటూ గీతా మాధురి రివర్స్ ఎటాక్ చేసింది. మరి ఏదో టైటిల్ గెలిచాం అది కూడా ప్రేక్షకుల వల్లే అని అందరితో మింగిల్ అవకుండా ఇలా తానేదో స్టార్ అన్నట్టుగా ఫీల్ అవుతున్న కౌశల్ కు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: