తమన్న భాటియా ఈ ముద్దు గుమ్మ అందాల బొమ్మ. పాల తెలుపుల సొగసుగత్తె. మేకప్ ని మించిన జిగి బిగి సోయగాలు వరంగా తెచ్చుకుంది. పదేళ్ళుగా టాలీవుడ్లో ఉంటూ టాప్ స్టార్స్ అందరితోనూ పెయిర్  గా నటించి హిట్ అనిపించేసుకుంది. ఇపుడు సీనియర్ హీరోలకు జోడీగా రెడీ అంటోంది. ఇంతలో ఓ తలుక్కుమనే న్యూస్ తో తమన్నా మెరిసింది



అన్న నందమూరి బయోపిక్ లో తమన్న సెలెక్ట్ అయిందంటున్నారు. ఆమె పాత్ర జయప్రద వేషంట. అన్న గారు జయప్రద కాంబో అప్పట్లో సూపర్ డూపర్ హిట్ ఇద్దరూ కలసి ఓ పదిహేను వరకూ సినిమాలు వేశారు. అందులో ఎక్కువ సూపర్ హిట్లే. నందమూరి జయప్రద అంటే ఎన్నో హిట్ సాంగ్స్ మైండ్ లోకి వస్తాయి. అందులో మొట్ట మొదటిది ఆరేసుకోబోయి పారేసుకున్నను హరీ అన్న అడవిరాముడు పాట. ఈ సాంగ్ ఆ రోజుల్లోనే కోటి రూపాయల పాటగా పేరు పొందింది. మరి ఆ కొంగు బంగారం లాంటి సాంగ్ లో తమన్నా బాలయ్యతో ఆడి పాడితే ఆ ముచ్చటే వేరుగా ఉంటుంది కదా.



ఇక మరో సాంగ్. యమగోల సినిమాలోనిది.  అడవిరాముడు తరువాత వెంటనే వచ్చిన చిత్రం. ఇది కూడా మాస్ సాంగ్స్ తో నాటి యువ తరాన్ని ఉర్రూతలూగించేసింది. ఇందులో ఒలమ్మీ తిక్క రేగిందా అంటూ అన్న గారు జయప్రదతో వేసిన స్టెప్పులు ఓ ట్రెండ్ గా చెప్పుకోవాలి. మరి తమన్నా ఈ సాంగ్ ని కూడా ఒక  బిట్ గా చేస్తుందని బయోపిక్ వర్గాల టాక్. అదే జరిగితే చూసే వారికి పండగే మరి.



ఇక తమన్నా జయప్రదలా మెరిసిపోవడం ఖాయమని కూడా అంటున్నారు. . ఎత్తు పరంగా చూసినా ఇద్దరికీ సరిపోతుంది. నిండు ముఖం, ఆ చార్మింగ్ ఫేస్ జయప్రదను గుర్తు చేయకమానవు. ఇక అన్న గారి పాత్రలో బాలయ్య ఒదిగిపోతే ఇద్దరి కాంబో కొత్త రికార్డ్లు క్రియేట్ చేయడం డాం ష్యూర్ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: