నందమూరి తారక రామారావు - అంటే ఒక లెజెండ్. కొందరికి జలదరింపు. మరి కొందరికి కవ్వింపు. అయితే ఎందరికో ఆరాధనీయుడు. కారణం ఆయన బహుముఖ ప్రఙ్జాశాలి కావటమే కాదు. ఏ రంగంలో ప్రవేశించినా తరచి చూసి ఏదో సాధించాలనే తపన, పట్టుదల ఆయన స్వంతం. ఐరన్ లెడీ ఇందిరా గాంధి కే చెమటలు పట్టించిన ఆయన రాజకీయం, నూరేళ్ళ కాంగ్రెస్ ను పొత్తిళ్ళ లోనే చాలెంజ్ చేసి విజయం సాధించిన తీరు అనితర సాధ్యం. ఇది ఒక కోణం.  


కీ.శే. గజ్జెల మల్లారెడ్డి లాంటి ప్రముఖ పాత్రికేయుడు "అధముల్లో ప్రధముడు" అంటూ నందమూరి లక్ష్యంగా నాడు ఆంధ్రభూమి దినపత్రిక లో రాసిన సెటైరిక్ కాలం మల్లారెడ్డి మాటకచేరీ (అనుకుంటా!)  జగద్విదితం. అలాగే డా. ఫ్రభాకర రెడ్డి దర్శకత్వంలో డివిఎన్ రాజు నిర్మించిన "మండలాదీశుడు" నాటి రాజకీయాలకు సెటైరిక్ గా నిర్మించినా ఆ తరం నందమూరి ప్రతిబింబాన్నే ప్రతిపలించిన తీరు మరువలేం. 
Image result for lakshmis ntr poster

ఇప్పటికీ మరెప్పటికైనా "సాహసం" అనే ఇంటిపేరుతో సార్ధకమైన నటశేఖరుడు ఘట్టమనేని కృష్ణ నటించి నిర్మించిన నా పిలుపే ప్రభంజనం సినిమాలు సమాజాన్నే కాదు రాజకీయ వాతావరణన్ని ప్రతిబింబించిన సినిమా నాడు "ప్రభంజనమే". 
Image result for mandaladeesudu
"మండలాదీశుడు" పండిన దృశ్యం  


అయితే నందమూరి బయోపిక్ పేరుతో "ఎన్ టి ఆర్" గా బాలకృష్ణ తీస్తున్న సినిమా ఖచ్చితంగా రామారావు జీవిత చరిత్ర మాత్రం కాదు! అదెప్పటికీ రామారావును జీవిత చరిత్రకు ప్రతిబింబం కాలేదు కాబోదు...అది వారి కుటుంబంలో వారికే నచ్చకపోవచ్చు. ఏదో చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే పొలిటికల్ ఎంటర్టెయిన్మెంట్ గా చెప్పవచ్చు.  
Image result for lakshmis ntr poster

నందమూరికి సమీపంలో ఎదురుగా ...నారా చంద్రబాబు నాయుడు 


అయితే ఈ సందర్భంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాలని తలపెట్టిన "లక్ష్మీస్ ఎన్టీఆర్" ఎన్టీఆర్ ద్వితీయ కళత్రం లక్ష్మి పార్వతి కేంద్రంగా నిర్మించాలనుకున్న సినిమా తెరమరుగైందనే అందరూ అనుకుంటు న్నారు. "లక్ష్మీస్ ఎన్టీఆర్" పేరుతో  ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు ఆయన గతంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన నిశ్శబ్ధంగా ఉంటూ ఏ ఇతర వివరాలూ ఇంతవరకు వెల్లడించలేదు.



ఈ మద్య ముంబై కి చెందిన ఎంటర్ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌ పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో "లక్ష్మీస్ ఎన్టీఆర్" రూపొందించనున్నట్లు, ఈ విజయ దశమికి సినిమా ప్రారంభించి జనవరి చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవి) తెలిపాడు. అక్టోబర్ 19 న పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ తొలిసారిగా ఆయన సుముహూర్తాన్ని కూడా వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబునాయుడులతో కూడిన పాత పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పోష్ట్ చేశారు.  
Image result for lakshmis ntr poster

నందమూరి జీవన గుమ్మానికి అవతల...నారా చంద్రబాబు నాయుడు 


తొలిసారిగా సినిమాకు మంచి ముహూర్తం ఖరారు చేసుకుని రామ్ గోపాల్ వర్మ  ప్రారంభిస్తున్న చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" మాత్రమేనని, ఆయన సెంటిమెంటుకు విరుద్ధంగా తిరుమల బాలాజీ పాదాల చెంత తిరుపతి లో ప్రారంభిస్తున్నానని, ఎన్టీఆర్ పై గౌరవంతో పవిత్ర భావన తో ఆ పనిచేస్తున్నానని కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమా పొలిటికల్ సినిమా ననే చెప్పవచ్చు, "లక్ష్మి పార్వతి" చుట్టు అల్లుకునే నందమూరి బయోపిక్ గా ఉంటుందనటము అతిశయోక్తి కాదు.


ఎన్టీఆర్ ట్రూ స్టోరీ అనే హ్యాష్-టాగ్ జోడించి ఆ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఎన్టీఆర్ బాల్యం.. ఆయన సినిమాల్లో ఎదగడం.. స్టార్ పొలిటీషియన్ కావడం.. ముఖ్యమంత్రిగా మారడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అని... ఇందులో ఏమాత్రం కాన్-ఫ్లిక్ట్ అనేదే లేదని.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం చూపించినా అది పేలవంగా ఉంటుందని.. కానీ లక్ష్మీపార్వతి రాక తో ఎన్టీఆర్ జీవితంలో అనేక పరిణామాలు జరిగాయని.. ఆ స్ట్రగులే తాను చూపిస్తానని వర్మ ఇంతకుముందే ప్రకటించాడు. మరి వర్మ నిజంగా ఈ సినిమా తీసి జనాల ముందుకు తెస్తాడా అన్నది చూడాలి.

లెటజ్ వెయిట్ .... టు సీ ..... వాటీజ్ వాట్?    
 

మరింత సమాచారం తెలుసుకోండి: