అంధకారంతో ప్రపంచం సృష్టి లేకుండా ఉన్న సమయంలో అమ్మవారు తన కూష్మాండా దేవి రూపంతో ఈ విశ్వాన్ని సృష్టించినట్లు కొన్ని గాధలు చెపుతున్నాయి. ఈమె శరీర కాంతి సూర్య సమానంగా దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉండటంతో ఈమె తేజస్సు వల్ల విశ్వం ప్రకాశిస్తుంది అని నమ్మకం. 

ఈమె సప్త హస్తాలతో కమండలం ధనుర్బాణాలు కమలం అమృత కలశం చక్ర గదాయుధాలతో అష్టమ భుజంలో సర్వ నిధులు సిద్ధులు ప్రసాదించే జపమాలతో కనిపించే ఈమె శక్తి ఈరోజు తారా స్థాయిలో ఉంటుందని పండితులు చెపుతారు. సంస్కృత భాషలో గుమ్మడి కాయను కూష్మాండం అంటారు. ఈరోజు అమ్మవారికి చేసే పూజలు తరువాత గుమ్మడి కాయను పగలు కొట్టడం జరుగుతుంది కాబట్టి ఆమెకు ఎంతో ఇష్టమైన ఈ కూష్మాండ పేరుతో ఈరోజు అవతారాన్ని కూష్మాండా దేవి అవతారంగా మార్చారు.

ఈరోజు సాధకుడి మనసు అమ్మవారి అనాహత చక్రంలో లయమవుతుంది. కనుక సాధకుడు అత్యంత పవిత్రంగా కూష్మాండా దేవి స్వరూపాన్ని మనసులో పెట్టుకుని పూజలు చేస్తే ఆ పూజలు వల్ల సర్వ రోగాలు శోకాలు నాశనం ఐపోతాయి అని అంటారు. 
అంతేకాదు ఈరోజు పూజతో అమ్మ భక్తులకు ఐశ్వర్యాలు కలిగించడమే కాకుండా మనం ఈరోజు చేసే అతి తక్కువ పూజలకే ఆమె ప్రశన్నరాలు అవుతుందని నమ్మకం. ఈరోజు అమ్మవారిని చేమంతులు గులాబీలతో పూజించి పులగం నివేదన చేయాలి. భక్తితో అమ్మను పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం.. 




మరింత సమాచారం తెలుసుకోండి: