టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో ఒక టాప్ హీరో సినిమాకు సంబంధించి మీడియాకు లీక్ అయిన కలెక్షన్స్ విషయంలో వాస్తవాలు ఎన్ని ?అన్న కోణంలో చర్చలు జరగడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన మహేష్ 'భరత్ అనే నేను' కలెక్షన్స్ విషయంలో కూడా ఫేక్ ప్రచారం జరిగింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో నిర్మాత  దానయ్య ఖండించిన విషయం తెలిసిందే.
Jr NTR in Aravinda Sametha
ఇప్పుడు మళ్లి కలెక్షన్స్ సునామీ సృట్టిస్తున్న 'అరవింద సమేత' కు ఈ సమస్య  వచ్చినట్లుగా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే 'అరవింద సమేత' నాన్ 'బాహుబలి' రికార్డులను బ్రేక్ చేసింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో కొంత మేర కలకలం సృట్టిస్తున్నట్లు టాక్. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే 'అరవింద సమేత' టికెట్ ను ఆంధ్రప్రదేశ్  లోని అన్ని సెంటర్లకు సంబంధించి 200 రూపాయలుగా నిర్ణయించి అమ్ముతూ ఉండటంతో నిన్న ఈ సినిమాకు సంబందించిన బిసి సెంటర్లలో కలెక్షన్స్ విషయంలో కొద్దిగా డ్రాప్ వచ్చినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. 
 NTR-Aravinda-Sametha
ఈ సినిమాను బిసి సెంటర్లో జూనియర్ అభిమానులు అంతా ఇప్పటికే చూసివేయడంతో పాటుఈ సెంటర్ల లోని సాధారణ ప్రేక్షకులు ఈ మూవీ టికెట్ ప్రైస్ తగ్గిన తరువాత చూడవచ్చు అన్న అభిప్రాయానికి రావడంతో బిసి సెంటర్లకు సంబందించి ఈ డ్రాప్ వచ్చింది అని అంటున్నారు. దీనితో ఈ ప్రమాదాన్ని పసిగట్టిన 'అరవింద సమేత' నిర్మాతలు అసలు కలెక్షన్స్ విషయంచెప్పకుండా కొంత మేర కలెక్షన్స్ ఫిగర్స్ ను పెంచి లీకులు ఇమ్మని ఈ మూవీ  డిస్ట్రిబ్యూటర్ల పై వ్యూహాత్మక ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి.

ఇప్పుడు  ఈ వార్తలు వైరల్ గా మారి హడావిడి చేస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో 'అరవింద సమేత'  కలెక్షన్స్ విషయంలో కూడా ఫేక్ కలెక్షన్స్ రగడ మొదలు అవుతుందా ? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న 'అరవింద సమేత' కలెక్షన్స్ పై కూడా అనుమానాలు ప్రారంభం అవుతాయి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరు  గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: