తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.  శివ చిత్రం నుంచి ఆయన ప్రస్ధానం మొదలు పెట్టి..ఎన్నో హిట్లు అందించారు. గత కొంత కాలంగా రాంగోపాల్ వర్మకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.  ఆయన ఏ చిత్రం తీసినా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతుంది. రీసెంగా అక్కినేని నాగార్జున తో ఎన్నో అంచనాల మద్య విడుదలైన ‘ఆఫీసర్’ చిత్రం కూడా అట్టర్ ఫ్లాన్ అయ్యింది.  తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ఓ పోస్ట్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. 


తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా షూటింగ్ ను దసరా రోజున ప్రారంభిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.  ఇదిలా ఉంటే.. ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు.


ఇప్పటికే విపరీతంగా వైరల్‌ అయిన  వీడియో క్లిప్‌పై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. ఈ వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో ఎవరైనా నాకుసాయం చేస్తారా.? అతన్ని నాకు టచ్‌లోకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ అందిస్తా.’ అంటూ వర్మ ఆ వీడియోను తన ట్విటర్‌పేజ్‌ లో పోస్ట్ చేశాడు.  ఎవరికైనా తెలిస్తే Laksmisntr@gmail.com మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: