టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తన సత్తా చాటుతున్నారు.  చిన్న తనంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా మారారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్ లో 24 సినిమాలు తీశారు.   అయితే ఇండస్ట్రీలో ఇప్పటికే హ్యాండ్సమ్ గా ఉంటూ..కుర్ర హీరోలు సైతం కుళ్లుకునేలా చాలా అందంగా కనిపిస్తుంటారు మహేష్ బాబు.   ఎంతో మంది కలల రాకుమారుడిగా మనసు దోచిన మహేష్ బాబు ఇద్దరు పిల్లల తండ్రి. 
Mahesh Babu
నమ్రత శిరోడ్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మహేష్ బాబు  ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ మేజర్‌ పార్ట్‌ పూర్తయ్యింది.  ఇక మహేష్ బాబు తన కుటుంబం అంటే ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే.  తన సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా విదేశాలకు కుటుంబంతో టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. 
Mahesh Babu
ఆ సమయంలో నమ్రత ఫోటోలు తీస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.  తాజాగా మహేష్ మరో లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీతో కలిసి జర్మనీలో ఎంజాయ్‌ చేస్తున్నాడు. అక్కడ అభిమానులతో కలిసి దిగిన ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

సూట్‌లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్న మహేష్ లుక్‌ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ‘‘ఏమున్నాండ్రా బాబు’’, ‘‘మహేశ్ బాబు నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నా’’ ‘‘ఏమున్నాండ్రా బాబు.. ఇలాంటి ఆయన నా ఫ్రెండ్స్‌లో ఉంటే చాలు.. ఈజీగా అమ్మాయిలను పడేయచ్చు’’ అంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు.   అక్టోబర్‌ మూడో వారం నుంచి ఇదే లుక్‌లో అమెరికాలో జరగనున్న షూటింగ్‌లో పాల్గొననున్నాడు మహేష్. ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: