నందమూరి, అక్కినేని తెలుగు సినిమాకు రెండు కళ్ళు. వాళ్ళిద్దరూ కలసి ఏకంగా 13 చిత్రాల్లో నటించారంటేనే వారి మధ్య ఎంతటి అనుబంధం ఉందో అర్ధమైపోతుంది. వ్రుత్తిపరంగా పోటీ ఉన్నా మేకప్ తీసేశాక మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవారంటారు. ఇక తమలోని లోపాలను కూడా ఇద్దరు తెలుసుకుని కెరీర్ మలచుకున్నారు. ఎవరి పాత్రలు వారివే అని ఫిక్స్ కూడా అయిపోయారు.


మరి ఆ తరువాత జనరేషన్లో నందమూరి వారి వారసుడిగా బాలక్రిష్ణ, అక్కినేని వారసుడిగా నాగార్జున సినీ రంగ ప్రవేశం చేసి జనాల చేత జేజేలు అందుకున్నారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం తమ తండ్రులు మాదిరిగా కలసి నటించలేదు. బయట స్నేహం కూడా బహు తక్కువే ఇక ఈ మధ్య కాలంలో ఏవో విభేదాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.


అదే టైంలో హరిక్రిష్ణతో నాగార్జునకు రిలేషన్లు బాగున్నాయి. ఇద్దరూ కలసి సీతారామరాజు అనే సినిమా కూడా చేశారు. హరిక్రిష్ణ తనయుడు జూనియర్ తోనూ నాగ్ బాగానే ఉంటాడు. ఇక ఆయన తనయులు కూడా మంచి రిలేషన్లు మైంటైన్ చెస్తున్నారని చెప్పడానికి ఓ ఉదాహరణ తారక్ ఇరగదీశాడు అంటూ నాగ్ రెండవ కొడుకు అఖిల్   తాజాగా మెచ్చుకున్నాడు.


అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఓ రేంజిలో నటించాడు. అధ్బుతమైన నటుడు అంటూ అఖిల్ పొగిడేశాడు. తారక్ ఎంత మంచి నటుడన్నది ఈ మూవీతో మరో మారు ప్రూవ్ అయిందని అఖిల్ ప్రశంసల  వర్షం కురిపించేశాడు. `తార‌క్ ఎంత గొప్ప న‌టుడో `అర‌వింద స‌మేత‌` చిత్రం మ‌రోసారి మ‌నంద‌రికీ గుర్తు చేస్తుంది. ఎన్టీయార్ న‌ట‌న అద్భుతం. ఈ విజ‌యానికి ఆయ‌న అర్హుడు అంటూ కితాబు ఇచ్చాడు.


ఇది నిజంగా మంచి పరిణామం. మళ్ళీ నాటి తాతల మాదిరిగా మనవళ్ళ మధ్య అనుబంధం పరవళ్ళు తొక్కుతోందనిపిస్తోంది.  అలాగే ఒక హీరో వేరోక హీరోను మెచ్చుకోవడం కూడా టాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ ని సూచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: