మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’హిట్ టాక్ వచ్చి కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.  అయితే ఈ సినిమా పై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్.  అయితే సాంగ్స్ విషయంలో మొదట్లో కాస్త నెగిటీవ్ టాక్ వచ్చినా..సినిమా చూసిన తర్వాత అభిప్రాయం మారిపోయింది.  ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.  ముఖ్యంగా బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ..ప్రస్తుత తరుణంలో మ్యూజిక్ చాలా ఈజీ అయిపోయింది. పియానో కొనుక్కొని సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. అయితే నా దృష్టిలో సంగీత దర్శకుడిగా రాణించాలంటే సంగీతవిభావరిల్లో ఎక్కువగా పాల్గొనాలి.
Related image
ఇండస్ట్రీలో కొన్ని మ్యూజిక్ లు ఒకలా ఉంటాయని కాపి కొడతారా అని ప్రశ్నిస్తుంటారు..కానీ అలాంటిది ఎక్కడా ఉండదు. కెరీర్ ఆరంభంలో నేను దాదాపు 6000లకుపైగా స్టేజీషోలు చేశాను. వాటివల్లే సంగీత దర్శకుడిని కాగలిగాను. మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వల్ల కమర్షియల్ పాటలు ఎలా చేయాలి? ఆల్బమ్ సాంగ్స్ ఎలా చేయాలి? అనే అంశాల పట్ల అవగాహన పెరుగుతుంది. ట్యూన్స్‌ను ఎక్కడి నుంచో కాపీ కొడుతున్నారనే విమర్శల్ని నేను అస్సలు పట్టించుకోను. ధైర్యముంటే ఈ అంశంలో అగ్ర సంగీత దర్శకుల్ని ప్రశ్నించండి. ఆ పని ఎవరూ చేయరు.
Image result for aravinda sametha
నేను కామ్‌గా ఉంటానని నా మీద అనవసరమైన విమర్శలు చేస్తారు. బిజినెస్‌మేన్ నా పద్దెనిమిదవ సినిమా. అందులో ఓ పాట కాపీ కొట్టానని విమర్శలు చేశారు.  ఇప్పటికీ దాదాపు 60 సినిమాలు చేశాను. కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ స్థాయిలో అవకాశాలు వచ్చేవా? అని ప్రశ్నించారు.  మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటారు..అందుకే హిట్ టాక్ వస్తుందని అన్నారు.  అరవింద సమేత కోసం దాదాపు సంవత్సరకాలంగా త్రివిక్రమ్, తారక్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఈ ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. సినిమా విడుదలయ్యాక వారిద్దరు అందించిన ప్రశంసలు వింటుంటే..నా జన్మధన్యమైందనుకున్నాను.  పరిశ్రమలోని పలువురు దర్శకులు కూడా నా వర్క్ చాలా బాగుందని మెచ్చుకున్నారు.ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్, తారక్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
Image result for aravinda sametha
దాంతో మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలిగాను. త్రివిక్రమ్ సినిమాలు చక్కటి కథాబలం, గొప్ప సంభాషణల మేళవింపుతో వుంటాయి. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది.  సందర్భానుసారంగా ఎలాంటి పాటలు అవసరమో త్రివిక్రమ్ సలహా ఇచ్చారు. అందువల్లే వైవిధ్యమైన బాణీలను అందించగలిగాను.కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నాను. గడచిన కొద్దికాలంగా దర్శకుల అభిరుచుల్లో కూడా చాలా మార్పులొచ్చాయి.  హైదరాబాద్‌లో మ్యూజిక్ టాలెంట్ విస్తారంగా ఉంది. గాయనీగాయకులు, వాయిద్యకారులు ఎందరో ఇక్కడ ఉన్నారు. ప్రతి పనికి చెన్నైకి పోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  సినిమా హిట్ చేసినందుకు ధన్యవాదలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: