గతంలో అనేక సార్లు ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై అనేక వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారి ఎదో ఒక సందర్భంలో వీరిద్దరూ ఈవార్తలను గాలి వార్తలుగా తీసి పారేస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘భాగమతి’ మూవీ విడుదల తరువాత అనుష్క పెద్దగా ఎక్కడా కనిపించలేదు. 
Anushka-Latest-Photos-Went-Viral
దీనితో ఆమె పై పెద్దగా వార్తలు కూడ రాలేదు. అయితే అనుష్క తన లావు సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆస్ట్రేలియా లోని ఒక ప్రముఖ వెయిట్ లాస్ క్లినిక్ కు వైద్యం నిమిత్తం వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఆస్ట్రేలియాలో కనిపించకుండా ప్రస్తుతం ప్రభాస్ రాథా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ స్పాట్ లో ఇటలీలో కనిపించడం సంచలన వార్తగా మారింది.
anu-5
‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇటలీ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ను చూడటానికి ప్రభాస్ అభిమానులు చాలామంది షూటింగ్ స్పాట్ కు వస్తున్నట్లు సమాచారం. 
After Bhaagamathie now Anushka Shetty to turn Bhanumathi
ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రభాస్ ను కలవడానికి వెళ్ళిన అభిమానుల కంట అనుష్క పడినట్లు టాక్. అయితే ఆనందంతో ప్రభాస్ అభిమానులు చాలామంది అక్కడ షూటింగ్ స్పాట్ లో ఉన్న ప్రభాస్ అనుష్కలతో కలిసి ఫోటోలు తీయించుకోవాలని ప్రయత్నించినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. అయితే ఇప్పుడు ఈవార్త ఇటలీ నుండి లీక్ కావడంతో అనుష్క ఆస్ట్రేలియా వెళ్ళకుండా ఇటలీలో ఏమి చేస్తోంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: