చందమామ కాజల్ ఇపుడు ముద్దు గుమ్మ కాదా. సొగసులతో యూత్ గుండెలను కొల్లగొట్టే నెరజాణ కాదా.. ఆమె అపుడే సీనియర్ అయిపోయిందా. ఆమెతో జత కట్టేందుకు నో చెబుతున్నారా ఈ వరస ప్రశ్నలకు  సమాధానం అవును అనే వస్తోంది. కాజల్ నవ్వు తో మగధీరున్ని మెప్పించింది. బ్రుందావనంలో జూనియర్ తోఅ అడి పాడి హిట్లు కొట్టింది. మరి ఇపుడు ఆమె బాగా వెనకబడిపోయింది రేసులో.


ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే కాజల్ తో పెయిర్  వద్దు అంటున్నాడుట మన నాచురల్ స్టార్ నాని. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్లో నాని కొత్త మూవీ రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్ గా మొదట కాజల్ ని ఎంపిక చేశారు. అపుడు సరేనన్న నాని ఇపుడు హఠాత్తుగా పేచీ పెడుతున్నాడుట. కాజల్ వద్దు అంటూ నాని మొత్తుకుంటున్నాడని తెర వెనక టాక్.
ఆమెతో నాకు రొమాన్స్ సరిగ్గా కుదరదు, ఆ సీన్లు పండవు కూడా అంటూ నాని కొత్త కధలు చెబుతున్నాడుట.



ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్ ని పెట్టండంటూ నాని పోరుతున్నాడుట. అసలు సంగతి ఏంటంటే నానికి ఇపుడు సరైన హిట్లు లేవు. నాగార్జునతో చేసిన దేవదాస్ ఓ మోస్తరుగా ఆడింది. దాంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడాలంటే అన్ని విషయాలు సరిగ్గా కుదరాలని నాని అనుకుంటున్నాడుట. అందువల్లనే ఎపుడూ లేనిది హీరోయిన్ విషయంలో గొడవకు దిగుతున్నాడుట.
ఇక నానికి జోడి కాజల్ అంటే సోషల్ మీడియాలోనే సెటైర్లు గట్టిగా పడిపోయాయట. కాజల్ అంటీలా ఉంటుంది.


నానికి హీరోయిన్ ఏంటి అంటూ ఓ రేంజిలో పొస్టింగులు రావడం కూడా నానిని ప్రభవితం చేసిందని చెప్పుకుంటున్నారు. ఇక నాని పోరు పడలేని చిత్ర యూనిట్ వేరే హీరోయిన్ వెతుకులాటలో పడ్డారని టాక్. కాజల్ విషయానికి వస్తే ఆమె ఇపుడు ఎటూ కాకుండా పోయింది. సీనియర్లకు ఆమె నో చెబుతూంతే కుర్ర హీరోలు ఆమెకు నో అంటున్నారు. దీంతో చెతిలో సినిమాలు ఏవీ లేవట. కాజల్ ఇండస్ట్రీకి  వచ్చి అపుడే పదేళ్ళు దాటేశాయి. ఇంక పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోవచ్చునని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: