సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతున్న ‘అరవింద సమేత’ విడుదలైన 4వ రోజునాటికే 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది అన్న విషయాన్ని ఈసినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించకుండా ట్రేడ్ అనలిస్ట్ ఉమైర్ సంధు ప్రకటించడం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 11న విడుదలైన ‘అరవింద సమేత’ విడుదల అయిన మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో  ఈ మూవీ కలెక్షన్స్ కొన్ని ఏరియాలలో ‘బాహుబలి’ రికార్డులను సైతం బ్రేక్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. 
మొండికత్తి దెబ్బకు బాక్సాఫీసు బద్దలు
‘బాహుబలి’ తరువాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘అరవింద సమేత' ఇప్పటికే చరిత్ర క్రియేట్ చేసినప్పటికీ ఈమూవీ కలెక్షన్స్ ఫిగర్స్ గురించి ఈమూవీ నిర్మాతలు మాట్లాడకుండా కేవలం ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని మాత్రమే చెపుతున్నారు. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 
 ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?
మరో వారం పాటు దసరా హాలిడే సీజన్ ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పొందడం ఖాయం అని అంటున్నారు. అయితే జూనియర్ వ్యతిరేకులు మాత్రం ఈమూవీ కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే బిసి సెంటర్లలో డ్రాప్ వచ్చిందని ఈసినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కోణం తక్కువగా  ఉండటంతో ఈ మూవీసకి రిపీట్ ప్రేక్షకులు రావడం కష్టం అని అంటున్నారు. 
 డిఫరెంటుగా ట్రై చేసి సక్సెస్ అయ్యారు
‘అరవింద సమేత' మూవీ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ వరల్డ్ వైడ్ అన్ని ఏరియాలు కలిపి 92 కోట్లకు అమ్మకం జరిగిన నేపధ్యంలో ఇప్పటి వరకు ఈ సినిమాకు సమంధించి 50 కోట్ల షేర్ వచ్చినప్పటికీ మరో 42 కోట్లు రావలసి ఉన్న నేపధ్యంలో  ఈ సినిమాకు రిపీట్ ప్రేక్షకులు రాకుండా ఇంత భారీ మొత్తం ఎలా వస్తుంది అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలన్నీ యుద్ధంతో ముగుస్తాయి. అయితే ‘అరవింద సమేత’ అందుకు భిన్నంగా యుద్ధం తర్వాత జరిగే పరిణామాలను ఫోకస్ చేస్తూ శాంతిని నెలకొల్పేందుకు హీరో ఏంచేశాడు అనే కోణంలో చూపించడంతో మాస్ ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమాకు రిపీటేడ్ గా రావడం కష్టం అని అంటున్నారు. ఏమైనా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రేపు సోమవారం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: