ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం అరవింద సమేత హిట్ టాక్ తెచ్చుకొని రికార్డులు కొల్ల గొడుతూ వెళుతుంది. ఓవర్సీస్ లో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది అరవింద సమేత. ప్రీమియర్స్ తో కలిపి విడుదలైన మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, తాజా వసూళ్లతో 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించింది. టాలీవుడ్ హీరోలకు 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు కొత్తకాదు. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం తాజా వసూళ్లు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి.

వరుసగా నాలుగోసారి.. ఎన్టీఆర్ అరుదైన రికార్డు

కెరీర్ లో వరుసగా నాలుగోసారి 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం పెద్ద రికార్డు. హీరోలందరికీ ఒక సినిమా హిట్ అయితే, వెంటనే ఫ్లాప్ వస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. అలా వరుసగా నాలుగోసారి 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు అందుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి అరవింద సమేత కూడా చేరింది. ఇప్పటివరకు సౌత్ నుంచి ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ఇది. 


అరవింద కలెక్షన్స్.. తెర వెనుక ఏం జరుగుతుంది.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు...!

ప్రస్తుతం అరవింద సమేత సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తండ్రి మరణంతో సంబరాలకు దూరంగా ఉన్నాడు. అందుకే కొన్నాళ్ల పాటు విదేశాల్లో విశ్రాంతి తీసుకొని రావాలని నిర్ణయించుకున్నాడు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో జాయిన్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: