ఇప్పుడు సినిమా వాళ్లకు ఈ లీకులు తలనొప్పి ఎక్కువైపోయింది. మొన్న అరవింద సమేత సినిమా కూడా లీకుల భారిన పడింది ఇప్పడూ రామ్ చరణ్ సినిమా కూడా లీకుల భారిన పడింది.  ఇటీవల విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ వైజాగ్ చేరుకుంది.

Image result for ram charan boyapati movie leaked photos

ఈ సందర్భంగా రామ్‌చరణ్, బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యలు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభానికి ఆలింగనం చేసుకున్నారు. పుజానంతరం ఆలయ అధికారులు స్వామికి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ నటిస్తోంది.

Image result for ram charan

అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇందులో చరణ్ కత్తి పట్టుకుని ఫైట్ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.  అయితే ఈ లీకులతో చిత్ర యూనిట్ కు లేని పోనీ తలనొప్పులు మొదలవుతున్నాయి. వాటిని అరికట్టాడానికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఫలితం లేకుండా పోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: