రాంచరణ్ కు మరో చిచ్చు రగులుకుంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని నటించిన ‘తూఫాన్’ కు మరో చిచ్చు వచ్చి పడింది. ఇప్పటికే చిరంజీవి పై కోపంతో సీమాంద్రలో సీన్ సితారే అన్న సంకేతాలు రాగా, తాజాగా హైదరాబాద్ లో నిప్పు రాజేసి తూఫాన్ కు చిచ్చుపెట్టింది మన ప్రభుత్వం. దీంతో తూఫాన్ హిట్టు, కలెక్షన్లు భారీ ప్రమాదంలో పడ్డాయంటున్నారు సినిమావర్గాలు.

ఈనెల 6న తూఫాన్ విడుదలవుతోంది, ఏడున హైదరాబాద్ బంద్ కు టిజేఏసి, టివిద్యార్థి జేఏసి బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాదు హైదరాబాద్ కు వచ్చే అన్ని దారులను మూసేస్తామని హెచ్చరించింది. కారణం ఆరోజు ఏపిఎన్జీఓల సభకు సర్కారు అనుమతిచ్చి, టివిద్యార్థి జేఏసి ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడమే.

అంటే తూఫాన్ విడుదలయిన రెండవరోజే భాగ్యనగరం భగ్గుమంటోందన్నమాట. ఆరోజు సినిమాలు బంద్, ఏ సినిమాకైనా 50శాతం కలెక్షన్లు తెచ్చిపెట్టే హైదరాబాద్ లో ఒక్కరోజు అది కూడా విడుదలైన మరునాడే దెబ్బపడడం ఆ సినిమా కలెక్షన్లపై తీవ్రప్రభావం చూపెడుతుందన్న మాటే. అందుకే ఇప్పుడు తూఫాన్ సినిమానే రాజకీయ తూఫాన్ లో చిక్కుకుని అల్లల్లాడిపోతోంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: