‘అరవింద సమేత’ 100 కోట్ల కలక్షన్స్ టార్గెట్ ను రీచ్ కావడంతో ఈమూవీ 150 కోట్ల టార్గెట్ ను ఎప్పుడు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీకి సుమారు 97 కోట్ల బిజినెస్ జరగడంతో ఈమూవీకి సంబంధించిన బయ్యర్లకు ఇప్పటి వరకు వారు పెట్టిన పెట్టుబడిలో సగం వరకు వచ్చినట్లు తెలుస్తోంది. 
ఎన్టీఆర్ యాక్టరా, డాన్సరా
దీనితో ఈ దసరా సీజన్ ముగిసేలోగ ఈమూవీ బయ్యర్లు తమ అసలును రాబట్టకోగలిగితే ఈమూవీకి సంబంధించి రెండవ వారం నుండి బయ్యర్లు లాభాలలోకి వెళ్ళగలుగుతారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ ప్రమోషన్ ను మరింత పెంచడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన 5వ పాటను కూడ ఈ దసరా లోపే ఈమూవీకి కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
టైటిల్ చెప్పగానే
అయితే ఈ సినిమాలోంచి తీసేశారని తమన్ చెప్పిన ఐదో పాట ఇదికాదు. ఇది ఒక చిన్న సాంగ్ బిట్. సినిమా చివర్లో రెడ్డమ్మ తల్లి అనే సాంగ్ బిట్ వస్తుంది. ఆ పాటను పెంచల్ దాస్ రాశాడు. అతడే ఆపాటను తాను పాడుతూ వేరే వాళ్ళ చేత కూడ పాడించాడు. పెంచల్ దాస్ పాడిన వెర్షన్ ను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
 అరవింద లాగే ఉంటా
దీనికితోడు ఈసినిమాలోంచి తొలగించిన కొన్ని సీన్స్ ను కూడ రేపటి నుండి ‘అరవింద సమేత’ మూవీకి కలుపుతారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో ఎంటర్ టైన్ మెంట్ బాగా తక్కువైపోయింది అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో సునీల్ జూనియర్ లపై చిత్రీకరించి ఎడిటింగ్ లో కట్ చేసిన కొన్ని కామెడీ సీన్స్ ను రిపీట్ ఆడియన్స్ కోసం కలిపే ఆస్కారం ఉంది అని అంటున్నారు. నిన్నటితో మొదటి వీకెండ్ అయిపోవడంతో ‘అరవింద సమేత’ కు నేడు మన ఇరు రాష్ట్రాలలోను వచ్చే కలక్షన్స్ ను బట్టి ఈమూవీ 200 కోట్ల టార్గెట్ ను చేరుకుంటుందా ? లేదా అన్నది చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: