శరన్నవరాత్రులు మహోత్సవాలలో భాగంగా ఈరోజు దుర్గాదేవిని మహాలక్ష్మి గా అలంకరిస్తారు. మంగళ ప్రదమైన ఈ దేవత కరుణా కటాక్షాల కోసం ఈరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో రాక్షస సంహారం చేయడం అద్భుతఘట్టం.

అమ్మవారికి సంబంధించిన మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడుని సంహరించింది. లోక స్థితి కారణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మిల అవతారంగా ఈరోజును అమ్మను ఆరాదిస్తారు. 

అష్టలక్ష్మిల రూపంగా అమ్మవారికి జరిగే పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు అమ్మ వారిని దర్శించడం వల్ల భక్తులకు ఐశ్వర్యం విజయం ప్రాప్తిస్తాయి. శ్రీసూక్త మంత్ర ఉచ్చారణతో జరిగే పూజలలో అనేక నిఘూడ అర్ధాలు ఉన్నాయి. 

ఈరోజు  మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని తామరపుష్పాలతో విశేషంగా పూజించి అమ్మ అనుగ్రహం పొందుతారు. ఈరోజు అమ్మకు నైవేద్యంగా చిత్రాన్నం చేక్కరపొంగలి నివేదన చేస్తారు. ‘మహాలక్ష్మిని’ భక్తితో పూజించి అన్నింటా విజయాన్ని కోరుకుందాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: