పదే పదే వాళ్ళిద్దరూ మా మధ్య అలాంటి ఉద్దేశాలేమీ లేవన్నా వాళ్ళపై చెలరేగుతున్న రూమర్లు ఒక చోట చల్లారి, మరో చోట అంటుకున్న మంటల్లా సమసి పోవట్లేదు. రూమర్స్ ప్రత్యేకించి కొన్ని ఎన్ని సార్లు ఖండించినా సమసిపోవు సరి కదా! తిరిగి తిరిగి అవే రూమర్స్ ప్రచారం లోకి వస్తాయి. దాదాపు ఐదారేళ్ళుగా ఇవే పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి.
Image result for bahubali most beautiful devasena

అయితే ఈ పుకార్లు చల్లారక పోవటానికి వాళ్ళ ప్రవర్తన కూడా ఒక కారణమే. వాళ్ళిద్దరూ మామద్య ప్రేమ దోమ లాంటి ఉద్దేశాలు లేవు.  మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఎన్నిసార్లు చెప్పిన ఎవరూ నమ్మలేక పోతున్నారు. కారణం వాళ్ళ కళ్ళ లో కనిపించే ప్రత్యేక ఫీలింగ్స్ కావచ్చు లేదా వాళ్లను అంతలా  ఆరాధించేవాళ్ళ 
అభిమానులు వాళ్లు ఒకటై పోతే బాగుంటుందన్న ఫీలింగ్స్ కావచ్చు. బహుశ ఈ కథ లో కథానాయకుడు కథానాయకి ఎవరో పాఠకులకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. మీరనుకుంటున్నట్లు వారు ప్రభాస్ - అనుష్క లే. అనుమానం లేదు.   
Image result for sweety anushka and darlind prabhas a love story

వారేమో మేము "మంచి మిత్రులం" అంటారు అభిమానులు వారి సినీ ఆరాధకులు మాత్రం బియాండ్ ది లైన్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళు స్నేహితులు మాత్రమే కాదు, దానికి మించి మరేదో వాళ్ల మద్య ఉందని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. కొంతకాలం ప్రవాహం ఆగి సీజన్ రాగానే మళ్ళీ ప్రవహించే నదిలా వారి మద్య పుకార్ల అగ్ని మళ్ళీ ఏవరో ఆజ్యం పోసినట్లు రాజుకుంటుంది.  తాజాగా మరోసారి  ప్రభాస్ - అనుష్క మైత్రి మళ్ళీ మరోరకంగా వెలుగులోకి వచ్చింది.
Image result for sweety anushka and darlind prabhas a love story

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తాజాగా వెండితెర కెక్కుతున్న చిత్రం షూటింగ్ 'ఇటలీలోని కోమో' లో జరుగుతుంది. ఆ లొకేషన్ లో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ కు మాంచి సర్ప్రైజ్ యివ్వటానికి అనుష్క వచ్చిందని టాక్.  ఇటలీలో ఉన్న తెలుగు వారు "డార్లింగ్" ను చూసేందుకు ఆ షూటింగ్ లొకేషన్ కు వెళ్తే అక్కడ స్వీటీ అనుష్క డార్లింగ్ ప్రభాస్ తో ఉండడం చూసి షాక్ అయ్యారట.  
Image result for sweety anushka and darlind prabhas a love story

అనుష్క యూరప్ లోని ఆస్ట్రియాకు "వెయిట్ లాస్ ప్రోగ్రాం" లో రిజిస్టర్ చేసుకుని ప్రసిద్ధి గాంచిన "వివామేర్-స్పా" లో రెసిడెంట్ ప్రోగ్రాంలో శిక్షణ  తీసుకుంటున్నట్లు  టాలీవుడ్ లో ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ రెండు దేశాల కాపిటల్స్ మద్య దూరం 400మైళ్ళు మాత్రమే. ఎలాగూ దగ్గరే కాబట్టి పనిలో పనిగా డార్లింగ్ ప్రభాస్ ను స్వీటీ అనుష్క  కలుద్దామని వెళ్ళి ఉండవచ్చు అంటున్నారు 
Related image

కారణం ఏదైనా ఏమైనా, డార్లింగ్-స్వీటీల ఇటలీ లో కలిసిన విషయం ఇప్పుడు మరోసారి వైల్డ్-ఫైర్ లాగా హాట్-టాపిక్ అయింది. టాలీవుడ్ మాత్రమే కాదు ఇక బాలీవుడ్ లో కూడా డార్లింగ్ -స్వీటీ రిలేషన్ పుకార్లకు మరోసారి రెక్కలువచ్చాయి. వైరల్ అయిన వార్తను నెట్టింట్లో, నెటిజెన్స్ మరోసారి వింటున్నా వీరిద్ధరి మద్య ప్రేమ పుకార్ల కు పుల్-స్టాప్ పడేలా లేదు. అసలు ఈ అభిమానులో మీడియానో వీళ్ళ పెళ్ళి చేసే వరకు నిద్రపోయేలా లేరు. దట్స్ ఇట్ వీరి మద్య ఏదో ఉంది? 

Image result for sweety anushka and darlind prabhas a love story

 

మరింత సమాచారం తెలుసుకోండి: