త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడుగా కన్నా రచయితగా ‘అరవింద సమేత’ లోని సంభాషణల  రూపంగా బాగా రాణించాడు అని విమర్శకుడు కూడ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ‘అరవింద సమేత’ కథలో మలుపుతిప్పిన ‘మొండి కత్తి’ ఎపిసోడ్ ట్విస్ట్ తన ఆలోచన అంటూ వెంపల్లి గంగాధరం అనే రచయిత సోషల్ మీడియాలోని తన ఫేస్ బుక్ లో షేర్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది.
వాళ్లు ఫైట్ మాస్టర్లు కాదు
అంతేకాదు ఈ రచయిత మరొక ట్విస్ట్ ఇస్తూ తాను త్రివిక్రమ్ ను ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో కలిసి రాయలసీమ భాషకు సంబంధించిన యాస గురించి అదేవిధంగా అక్కడి మనుషుల ప్రవర్తన గురించి చాల విషయాలు త్రివిక్రమ్ కు చెప్పాను అని అంటున్నాడు. అదేవిధంగా ‘అరవింద సమేత’ లోని మొండి కత్తి సీన్ తాను వ్రాసిన కథలోని ఒక కీలక సన్నివేశం అని చెపుతూ ఆ సీన్ ను యథా తధంగా త్రివిక్రమ్ కాపీ చేసాడు అంటూ సంచలన ఆరోపణలు చేసాడు వెంపల్లి గంగాధరం.
ఒక ప్లాపు, ఒక విషాదం తర్వాత
అయితే ఈ రచయిత తన ఫేస్ బుక్ లో పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతూ ఉండగానే కొద్ది గంటలలో ఆ పోస్ట్ ను ఈ రచయిత తీసివేయడం వెనుక కారణాలు ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమా విషయంలో యద్దన పూడి మీనా నవలను అదేవిధంగా ‘అజ్ఞాతవాసి’ విషయంలో ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టాడు అంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అవేమీ ఎన్టీఆర్ కావాలని అడగలేదు
తాను వ్రాసే డైలాగ్స్ విషయంలో అతి తక్కువ పదాలతో ఎంతో ఆలోచనలు కలిగించే సంభాషణలు వ్రాసే త్రివిక్రమ్ పై తరుచు ఇలాంటి కాపీ ఆరోపణలు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే మీడియాకు పెద్దగా పరిచయం లేని రచయిత వెంపల్లి గంగాధరం ఇలా త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేసి మరి కొద్ది సేపటికే తన ఆరోపణలు ఉపసంహరించు కోవడం వెనుక ఏదోఒక సస్పెన్స్ ఉంది అన్న సందేహాలు కలుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: