ఈ మద్య టాప్ హీరోల సినిమాలు..అప్ కమింగ్ హీరోల సినిమాలు సక్సెస్ అయితే తోటి హీరోలను వారిని ప్రశంసలతో ముంచెత్తున్నారు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోని కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది.  ఈ సినిమా హీరో అయిన ఎన్టీఆర్ నటన సహ నటులు, దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు.  యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్ని వేరియేషన్లలో ఎన్టీఆర్ నటన అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. 
Image result for aravinda sametha new stills
ఎన్టీఆర్.. ‘అరవింద సమేత’ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్ల‌తో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసి సన్సేషనల్ హిట్‌గా నిలిచింది.  ఇప్పటికే..దర్శకధీరుడు రాజమౌళి, జై లవకుశ దర్శకుడు బాబీ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నితిన్‌, అఖిల్ లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతూ ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
Related image
తాజాగా రంగస్థలం చిట్టిబాబు.. వీర రాఘవ నటనకు ఫిదా అయ్యా అంటూ ట్వీట్ చేశారు.  ‘బోల్డ్ స్టోరీ, సూపర్బ్ డైరెక్షన్‌తో ఈ మూవీ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో మాయ చేశారు. తమన్ సంగీత, విలాన్ పాత్రలో జగపతి బాబు నటన ఈ చిత్రానికి పిల్లర్లుగా నిలిచాయి. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా అద్భుతంగా నటించిందని ప్రశంసిచాడు చిట్టిబాబు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందిస్తూ.. ‘అరవింద సమేత నిజంగా ఓ ఎమోషనల్ ట్రీట్’ అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: