ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దర్శకుడు త్రినాధరావు నక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను  తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.  ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు.


ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.  ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత రామ్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ మూవీ కోసం జోడి కట్టారు. ప్రకాష్ రాజ్, పోసాని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే  చేసారు. తాజాగా ఈ మూవీకి సెన్సార్ క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసింది.  ఈ మద్య రిలీజ్ అయిన  ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగ్స్, ప్రకాష్ రాజ్.. రామ్ ల మధ్య జరిగే సంభాషణలు సినిమాపై హైప్ ని పెంచేశాయి. 

Image result for hello guru prema kosame

ఆ మద్య దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీకి సెన్సార్ వాళ్లు ఒక కట్ చెప్పకుండా..క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.  ఇపుడు అదే స్ట్రాటజీతో మంచి టాక్‌తో దూసుకుపోతున్న ‘అరవింద’కు పోటీగా ‘హలో గురు ప్రేమ కోసమే’ మూవీ రిలీజ్ చేసినా పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదని భావిస్తున్నాడు దిల్ రాజు. 

మరింత సమాచారం తెలుసుకోండి: