కేధరిన్ త్రెసా ఈ మళయాళీ ముద్దు గుమ్మ మరో మారు అందాల ఆరబోసింది. లేటెస్ట్ ఫొటో షూట్ లో గుమ్మెత్తించే అందాలతో కుర్ర కళ్ళకు కళ్ళెం వేసింది. ఎక్కడికక్కడ అందం అదరహో అంటూంటే ఖజరహో శిల్పంలా కేధరిన్ కన్ను కొడుతోంది. తెలుగులో మరో మారు తన హవా చాటాలనుకుందో ఏమో ఫొటో షూట్ తో తెగ ఫోజులిచ్చేసింది.


సరైనోడు సరసన సరైన జోడీ అనిపించిన ఈ యువ ఎమ్మెల్యే అందులో నటనతో పాటు గ్లామర్ తోనూ కాక పుట్టించింది. చమక్ చల్లో అంటూ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కేధరిన్ తన కొంగు వెంట యువ హ్రుదయాలను చలో అనేలా చేసుకుంది. ఆ మీదట పైసా మూవీలో క్రిష్ణ వంశీ క్రియేటివిటీతో కొత్త బ్యూటీగా అలా కళ్ళకు కట్టేసుకుంది.  పూరీ జగన్నాధ్ ఇద్దరమ్మాయిలతో మూవీలోనూ తనదైన అందంతో ఆకట్టుకుంది కేధరిన్ 



రుద్రమదేవి, ఎర్ర బస్సు తో పాటు లాస్ట్ గా ఆమె నటించిన మూవీ జయ జానకీ నాయకా. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ కి జతగా ఆడిపాడింది. ఆ మూవీ హిట్ అయినా కొత్త చాన్సులు మాత్రం తలుపు తట్టలేదు. ఇతర భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు మళ్ళీ తెలుగు తెరపై మెరవాలనులనుకుంటోందట.


అందుకే మరో మారు తన సౌందర్యాన్ని ఫొటో షూట్ లో ఇలా  వలకబోసి పలకరిస్తోంది. మరి కలవరించే పడుచు గుండెలు పరవశించాలంటే అర్జంట్ గా ఏ నిర్మాత అయినా కేధరిన్ ని హీరోయిన్ గా బుక్ చేయాల్సిందే. అసలే హీరోయిన్ల కొరత తో ఉన్న టాలీవుడ్ చూపు  ఇపుడు కేధరిన్ పై కచ్చితంగా పడక మానదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: