‘అరవింద సమేత’ సినిమా చూసిన వారందరికి ఎన్టీఆర్ జగపతి బాబు పాత్రలు చాలాకాలం గుర్తు ఉండి పోతాయి. అయితే ఈసినిమాలో నటించిన ఒకకొత్త కమెడియన్ అతడు చెప్పిన  కేవలం ఒకే ఒక్క డైలాగుతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా సాధారణ ప్రేక్షకుల మధ్య బాగా పాపులర్ అయ్యాడు. 'ఆకు తిను పోక తిను' అంటూ విభిన్నమైన పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆనటుడు పేరు మానిక్ రెడ్డి. తాను నటించిన ఒకే ఒక్క సినిమాతో సెలిబ్రిటీగా మారిపోయాడు. త్రివిక్రమ్ సునీల్ లు పంజాగుట్టలో ఒకచిన్న రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న రోజులలో వీరిద్దరికీ మాణిక్ రెడ్డి పరిచయం అని తెలుస్తోంది. 
‘ఆకు తిను' ఐడియా అలా వచ్చిందట
వాస్తవానికి మాణిక్ రెడ్డి చెప్పిన డైలాగ్ 'ఆకు తిను' ఒక యదార్ధ సంఘటనకు సంబంధించింది. హైదరాబాద్ పాతబస్తీలోని అలియాబాద్ అనే ప్రాంతంలో ఈసాంప్రదాయం ఉందట. ఆప్రాంతంలో  నివసించేవారు ఎవరైనా అతిధులుగా తమ ఇంటికి వస్తే కాఫీ టీలకు బదులు మర్యాదగా ‘ఆకు తిను లేదా పోక తిను’ అని బలవంత పెడతారట. ఒకవేళ ఆరెండింటిలో ఒక్కటైనా తినకపోతే ఆప్రాంతంలో ఉన్న వారికి విపరీతమైన కోపం వస్తుందట. 
త్రివిక్రమ్‌తో పరిచయం అలా...
ఈవిషయాన్ని మాణిక్ రెడ్డి త్రివిక్రమ్ కు చెపితే యథాతధంగా ‘అరవింద సమేత’ లో సీన్ గా మారిపోయింది. త్రివిక్రమ్ సినిమాలలో నటించాలని ఉత్సాహ పడుతున్న మాణిక్ రెడ్డి చేతనే ఈడైలాగ్ పలికించాడు త్రివిక్రమ్. వాస్తవానికి మాణిక్ రెడ్డికి పాన్ తినే అలవాటు లేకపోయినా ఈసీన్ తీసే విషయంలో చాల ఎక్కువరోజులు మాణిక్ రెడ్డిని త్రివిక్రమ్ టార్చర్ పెట్టడమే కాకుండా ఇతడు ఈమూవీలో నటించిన ప్రతి సీన్ లోను కిళ్ళీలు నవులుతున్నట్లు సహజంగా కనిపించడం కోసం 300 పాన్లు తినడంతో తన నోరు పగలిపోయి తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను అంటున్నాడు మాణిక్ రెడ్డి. 

అంతేకాదు తన సీన్స్ కు సంబంధించి షూటింగ్ అయిపోయిన తరువాత తనపాత్రకు సంబంధించిన డబ్బింగ్ సమయంలో కూడ నేచురాలిటీ కోసం మళ్లీ 20 పాన్లు త్రివిక్రమ్ తన కోసం తెప్పించి బలవంతంగా తినిపించాడు అంటూ త్రివిక్రమ్ టార్చర్ ను గుర్తుకు చేసుకున్నాడు మాణిక్ రెడ్డి. ‘అరవింద సమేత’ వల్ల సునీల్ కు మళ్ళీ కమెడియన్ గా టర్నింగ్ పాయింట్ వస్తుంది అనుకుంటే సునీల్ కు రాని గుర్తింపు ఇప్పుడు ఈమూవీ ద్వారా మాణిక్ రెడ్డికి రావడం యాదృశ్చికం అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: