జూనియర్ ‘అరవింద సమేత’ విడుదలైన తరువాత వచ్చిన నిన్నటి సోమవారం రోజున కూడ మంచి కలక్షన్స్ తెచ్చుకోవడంతో ఈమూవీ ఈ దసరా సీజన్ పూర్తి అయ్యే సరికి 200 కోట్ల కలక్షన్స్ గ్రాస్ మార్క్ ను అందుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ కు వచ్చిన ఈ అనూహ్యమైన విజయం ఫ్లాప్ డైరెక్టర్స్ కు సెంటిమెంట్ గా మారింది. 
NTR Jr. returns to Aravinda Sametha sets - Sakshi
సాధారణంగా టాప్ హీరోలు అంతా భారీ సక్సస్ లు అందుకుంటూ టాప్ రేంజ్ లో కొనసాగుతూ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. అయితే జూనియర్ ఒక టాప్ డైరెక్టర్ కు అనుకోని విధంగా భారీ ఫ్లాప్ వచ్చినా ఆవిషయాలు పట్టించుకోకుండా అదే దర్శకుడుతో చేసిన సినిమాలు హిట్ కావడమే కాకుండా జూనియర్ కు నటుడుగా కూడ చాల మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి.

గతంలో సుకుమార్ మహేష్ తో ‘1 నేనొక్కడినే’ సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకున్న తరువాత జూనియర్ సుకుమార్ తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీని చేసి హిట్ ను పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడ అందుకున్నాడు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ త్రివిక్రమ్ కు ‘అగ్నాతవాసి’ భారీ ఫెయిల్యూర్ ఇచ్చినా ఆవిషయాన్ని పట్టించుకోకుండా ‘అరవింద సమేత’ చేసి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా జూనియర్ నటనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. 

దీనితో జూనియర్ కు సక్సస్ ట్రాక్ లో ఉన్న దర్శకులకన్నా ఫెయిల్యూర్ ట్రాక్ లో ఉన్న దర్శకులు బాగా కలిసి వస్తున్నారు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో చాల చోట్ల వినిపిస్తున్న నేపధ్యంలో తమకు కూడ జూనియర్ నుండి పిలుపు వస్తే తమ దశ తిరుగుతుంది అన్న ఆశతో చాలామంది టాప్ ఫెయిల్యూర్ డైరెక్టర్స్ జూనియర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. అయినా రాజమౌళి బందిఖానాలోకి తిరిగి మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో తనకే తెలియని పరిస్థుతులలో జూనియర్ ఈ ఫెయిల్యూర్ డైరెక్టర్స్ కలను నిజం అయ్యే రోజులు ఎప్పుడో..
 


మరింత సమాచారం తెలుసుకోండి: