ఇప్పుడు దేశ వ్యాప్తంగా ‘మీ టూ ’ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు..ఇతర సంస్థల్లో కూడా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెరపైకి తీసుకు వస్తున్నారు.  గతంలో తమ పట్ల కొంత మంది పురుషులు చేసిన లైంగిక దాడుల విషయం కూడా బహింరంగాంగా చర్చిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై రచయిత్రి, నిర్మాత వింతా నందా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Image result for alok nath

ఈ నేపథ్యంలో ఆమెపై పరువునష్టం దావా వేశారు అలోక్ నాథ్. తన భార్య అశు నాథ్ తో కలసి వేసిన కేసులో... రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 1 పరిహారంగా చెల్లించాలని అడిగారు.  తనకు 19 వయసున్నపుడు అలోక్‌నాథ్ లైంగికంగా వేధించాడని, అతనొక తాగుబోతని, మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించే గుణం అతనిది సోషల్ మీడియా వేదికగా ఆమె పేర్కొంది. అయితే ఈ విషయమై రియాక్ట్ అయిన అలోక్ నాథ్.. ‘వింటాపై అత్యాచారం జరిగి ఉండొచ్చు.

Image result for alok nath

కానీ అది నేను కాదు.. ఇంకెవరో రేప్ చేసి ఉండొచ్చు’ అంటూ వివాదాస్పదంగా మాట్లాడటం పలు చర్చలకు దారితీసింది. తాజాగా వింటా నందాపై పరువు నష్టం దావా వేసి మరోసారి వార్తల్లోకి నిలిచాడు అలోక్‌నాథ్. వింటా తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కావాలనే ఆమె ఈ ఆరోపణలు చేస్తోందని.. ఇలా చేయటం వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ తనకు జరిమానాగా ఒక్క రూపాయి ఇచ్చి రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.  వింతా నందా తర్వాత సంధ్య మృదుల్, దీపిక అమీన్ అనే మహిళలు కూడా అతనిపై లైంగిక ఆరోపణలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: