తెలుగు ఇండస్ట్రీలో ఆ మద్య కాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి శ్రీరెడ్డి చేసిన సంచలనం అంతా ఇంతా కాదు.  ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వచ్చే ఎంతో మంది అమ్మాయిలను కొంత మంది పెద్దలు తమ లైంగిక వాంఛ తీర్చమని బలవంతం చేస్తారని..అలా కోరిక తీరిస్తేనే మూవీలో ఛాన్స్ ఇస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారని...ఎంతో మంది యువతులు అలాంటి వారి ట్రాప్ లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని....అలాంటి దుర్మార్గుల చేతుల్లో తాను కూడా బలైపోయానని కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది.  శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమానికి కొత్తలో పెద్దగా స్పందన రాకున్నా..ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత మహిళా సంఘాలు, విద్యార్థులు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది ఆమెకు మద్దతు పలికారు. 

ఇక ఉద్యమం తీవ్ర స్థాయికి వస్తున్న సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని తిట్టడంతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.  ప్రస్తుతం చెన్నైలో ఓ షూటింగ్ లో బిజీగా ఉన్న శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల ద్వారా స్పందిస్తుంది.  తాజాగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డికి లారెన్స్ నిర్మించబోతున్న ఓ సినిమాలో చాన్స్ లభించింది. ఈ విషయాన్ని శ్రీరెడ్డి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. విచిత్రం ఏంటంటే..గతంలో లారెన్స్ పై కూడా పలు విమర్శలు చేసింది. 

ఆ సమయంలో లారెన్స్ తాను చేయబోయే మూవీలో ఛాన్స్ ఇస్తానని..అంతే కానీ ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేయొద్దని కౌంటర్ ఇచ్చాడు.  ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ట్విట్టర్ లో స్పందిస్తూ..నా స్నేహితులందరికీ శుభవార్త. నేను లారెన్స్ ను ఆయన నివాసంలో కలుసుకున్నాను. ఆయన నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్ తో సంతోషంగా ఉన్నారు.

నేను ఆడిషన్స్ లో కూడా పాల్గొన్నానని..నా కోసం లారెన్స్ ప్రార్థించాడని..అంతే కాదు తన తదుపరి చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇస్తానని హామీ ఇవ్వడమే కాదు...తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని అన్నారు.  ఆ అడ్వాన్స్ ఈ మద్య ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో ‘తిత్లీ’తుఫాన్ ఎంత విషాదం మిగిల్చిందో తెలిసిందే..వారికోసం అడ్వాన్స్ విరాళంగా ఇస్తున్నానని పేర్కొంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: