రాంగోపాల్ వర్మ ఏం చేసినా ఒక సెన్సేషన్ ఉంటుందని అందరికీ తెలిసిందే.  ఈ మద్య మళ్లీ తన ట్విట్టర్ తో హంగామా మొదలు పెట్టారు. లక్ష్మీపార్వతి జీవితచరిత్ర ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే బయోపిక్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అవుతున్నాడు.  ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పోలికలు ఉన్న వ్యక్తి వీడియో పోస్ట్ చేసి ఈ వ్యక్తిని కనిపెట్టిన వారికి లక్ష రూపాలు ఇస్తానని ప్రకటించారు.  అన్నట్టుగానే ఓ జర్నలిస్ట్  చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి అడ్రస్ ఇవ్వడం..ఆయన అకౌంట్ కి డబ్బులు పంపానని మళ్లీ పోస్ట్ చేశాడు రాంగోపాల్ వర్మ. 

Man Traces Chandrababu Naidu Lookalike For Ram Gopal Varma, Gets Rs 1 Lakh Reward

తాజాగా ఇప్పుడు మరోసారి సోషల్ మాద్యమం వేధికగా ఎన్టీఆర్ పోలికలతో ఉన్న వ్యక్తి కనిపెట్టి ఫోటో అడ్రస్ పంపితే ఈసారి ఏకంగా పదిలక్షలు ఇస్తానని ప్రకటించాడు.   రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన తిరుపతిలో ఆరంభించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశానని, కానీ తనకి ఇంకా ఉత్తమమైన నటుడు కావాలని వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.

Image result for ram gopal varma laxmis ntr

 ''ముగ్గురు నటుల్ని షార్ట్ లిస్ట్ చేశా.. కానీ నాకు ఇంకా ఉత్తమమైన వ్యక్తి కావాలి.  లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కలుసుకున్నప్పుడు ఆయన ఎలా వుండేవారో .. అలాంటి పోలికలు కలిగిన వ్యక్తి వివరాలు తెలియజేయండి .. అందుకు సంబంధించిన వీడియోను laksmisntr@gmail.comకి పంపించండి అని ప్రకటించాడు. రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: