బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైనల్ రన్నర్ గీత మాధురి తన మీద యూట్యూబ్ లో ట్రోల్ చేస్తున్న వీడియోస్ ను తొలిగించమని ఆ యూట్యూబ్ చానెల్స్ వారికి హెచ్చరికలు జారీ చేసింది. తేజస్విని, దీప్తి సునయన, భాను శ్రీ, శ్యామల ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఈ ట్రోలింగ్స్ బాధితులే. కాగా.. బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్‌లో గట్టిపోటీ ఇచ్చి.. విన్నర్ టైటిల్‌కి ఒక్క అడుగు దూరంగా ఆగిపోయి, రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టేసిన గీతా మాధురికి ఈ ట్రోలింగ్స్ కోపం తెప్పించాయి.

ఆ వీడియోలు తొలగించకపోతే కేసులేస్తా: గీతా మాధురి వార్నింగ్

తనపై వస్తున్న తప్పుడు కథనాలపై స్పందిస్తూ.. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారామె. అంతేకాదు త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా హెచ్చరించారు గీతా మాధురి. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద త్వరలో లీగల్ యాక్షన్ తీసుకుంటా.. నాపైన తప్పుడు వార్తలు, తప్పుడు వీడియోలతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు .

Image result for geetha madhuri

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. ఆ వీడియోలను తొలగించడానికి సదరు యూట్యూబ్ ఛానల్స్ కొంత సమయం ఇస్తున్నా’ అంటూ హెచ్చరించారు గీతా మాధురి. అంతకు ముందు ‘మీరు ఎన్ని చేసినా మహా అయితే ఒక్కరోజు బాధ పడతానేమో తరువాత నా హ్యాపీనెస్ నాదే’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఆట అన్నాక గెలుపోటములు సహజం.. ఓడిపోయినంత మాత్రాన వ్యక్తిగత ఆరోపణలు చేసి.. వారి పర్శనల్ విషయాల్లో వేలు పెట్టడం, వారి జీవితాలను రోడ్డుకు లాగడం లాంటివి కరెక్ట్ కాదు. ఎవరి జీవితం వారిది. ఎవరి ఇష్టాలు వారివి. మనకు నచ్చిన వాళ్లు అందరికీ నచ్చాలనే రూల్ ఏమీ లేదు కదా. ఇప్పటికైనా గేమ్‌ని గేమ్‌లా చూసి వ్యక్తిగత ఆరోపణలు ఆపేసి కోర్టు పాలు కాకుండా ఉంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: