‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటే పరోక్షంగా పవన్ ఇమేజ్ ని జూనియర్ ఎన్టీఆర్ కాపాడాడు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి పవన్ జూనియర్ ల మధ్య పెద్దగా సాన్నిహిత్యం ఉందని ఎవరు ఊహించరు.
ntr, jr ntr, pawan kalyan, pawan kalyan film
అయితే రామ్ చరణ్ పెళ్ళిలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదటిసారి బయటపడింది. ఆపెళ్ళిలో పవన్ జూనియర్ లు త్రివిక్రమ్ తో కలిసి పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకున్న సంఘటనతో పవన్ జూనియర్ కు అంత ఆత్మీయుడా ? అన్న ఫీలింగ్ వచ్చింది. ఆతరువాత ‘అరవింద సమేత’ షూటింగ్ ఓపెనింగ్ ఫంక్షన్ కు పవన్ అతిధిగా రావడంతో వీరిద్దరి మధ్యా ఉన్న సాన్నిహిత్యం మరొకసారి బయటపడింది.
Aravinda Sametha
ఇప్పుడు ‘అరవింద సమేత’ కలక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న నేపధ్యంలో జూనియర్ పవన్ ఋణాన్ని పరోక్షంగా తీర్చుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీని నిర్మించిన హారికా హాసినీ సంస్థ పవన్ తో ‘అజ్ఞాతవాసి’ తీసి ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలు ఎదుర్కుంది. దీనితో ఈసంస్థ మనుగడకు ‘అరవింద సమేత’ సక్సస్ చాల అత్యవసరంగా మారింది. ‘అరవింద’ రికార్డుల హోరుతో హారికా హాసిని సంస్థ తనకు ‘అజ్ఞాతవాసి’ వాసి వల్ల ఏర్పడ్డ షాక్ నుండి పూర్తిగా తేరుకుంది. 

ఈవిషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే కాబోలు ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీ క్లైమాక్స్ సీన్లో చెప్పిన ‘కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనబడని యుద్ధం చేస్తున్నా’ అంటూ చెప్పిన డైలాగ్ ను యధాతదంగా చెప్పి తనకు పవన్ పట్ల ఉన్న అభిమానాన్ని మరొకసారి బయటపెట్టాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి జూనియర్ బాలకృష్ణల మధ్య ఇలాంటి సాన్నిహిత్యాన్ని నందమూరి అభిమానులు కోరుకుంటూ ఉంటే పవన్ జూనియర్ ల మధ్య పెరుగుతున్న ఈ పరోక్ష సాన్నిహిత్యం దేనికి సంకేతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: