‘మీ టూ’ ఉద్యమంతో మీడియా హోరెత్తిపోతున్న నేపధ్యంలో ఇప్పుడు ఆ సెగ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి కూడ తాకుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ వ్యవహారంలో బయటపడే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 
#MeToo: Mahesh's Brand Partner A Sexual Predator!
ఇలాంటి పరిస్థుతులలో అనూహ్యంగా మహేష్ బ్రాండ్ పార్టనర్ కు సంబంధించిన వార్తలను ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక ప్రచురించింది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. మహేష్ సినిమాల ఆదాయం కంటే అతడి బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ వల్ల వచ్చే ఆదాయం చాల ఎక్కువ దీనితో మహేష్ తన బ్రాండ్ ఇమేజ్ ని బాగా పెంచుకునేందుకు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో ప్రముఖ యాడ్ ఏజెన్సీస్ తో అదేవిధంగా అనేక టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు.
Mahesh Babu in Bharat Ane Nenu
ఈ నేపధ్యంలో మహేష్ కు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో సహాయ సహకారాలు అందించే ముంబాయికి చెందిన ప్రముఖ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అధినేత అనిర్బాన్ బ్లహ్  కొంతమంది బాలీవుడ్ సెలెబ్రెటీలను లైంగికంగా వేధించాడు అన్న వార్తలు వస్తున్నాయి. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మహేష్ తో పాటు రానాకు కూడ ఇతడు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో సహాయసహకారాలు అందిస్తున్నాడు అన్న వార్తలు ఉన్నాయి.
Leaked picture: Rana Daggubati's look as N Chandrababu Naidu in NTR biopic
ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రెటీలు దీపిక పదుకొనె రణబీర్ కపూర్ లకు కూడ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో ఇతడు తన సలహాలు అందిస్తున్నాడు. ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమం బాలీవుడ్ లో తీవ్ర స్థాయిలో చేరిపోయిన నేపధ్యంలో కొందరు బాలీవుడ్ దర్శకులు ‘మీ టూ’ ఉద్యమానికి మద్దతుగా తాము తీస్తున్న సినిమాలలో ఇక ఐటమ్ సాంగ్స్ పెట్టము అని ప్రకటనలు ఇస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో ఈ ‘మీ టూ’ ఉద్యమం వల్ల హీరొయిన్ ల పాత్రలకు సంబంధించిన లుక్స్ విషయంలో అనేక మార్పులు వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరి విశ్లేషకుల భావన..    


మరింత సమాచారం తెలుసుకోండి: