దేవీ నవరాత్రులకు సంబంధించి అత్యంత భక్తి భావంతో జరుగుతున్న శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు మహా పవిత్రమైన దుర్గాష్టమి రోజున అమ్మవారు శక్తి స్వరూపిణిగా దర్శన మిస్తుంది. లోక కంటకుడైన దుర్గమాసురుడుని సంహరించి అమ్మవారు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గగా వెలసినరోజు దుర్గాష్టమి అని అంటారు.

పంచ ప్రకృతి మహా స్వరూపాలలో దుర్గా రూపం మొదటిది. భవబందాలలో చిక్కుకున్న మానవుడుని దుర్గా మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 

కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను ఈరోజు దర్శించిన వారికి శత్రు బాధలు తొలిగిపోయి సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని మన భావాన. ‘దుర్గే దుర్గతి నాశిని’ అన్న వాక్యాన్ని తలుచుకుంటే చాలు ఈరోజు సకల విజయాలు కలుగుతాయి. 

ఈరోజు అమ్మవారిని ఎర్రటి అక్షింతలు ఎర్రటి గులాబీలతో అర్చించి గారెలు చిత్రాన్నం ప్రసాదంగా సమర్పించి అమ్మ అనుగ్రహం పొందుదాం..   



మరింత సమాచారం తెలుసుకోండి: