‘రంగస్థలం’ ఘన విజయం తరువాత సుకుమార్ మహేష్ ల కాంబినేషన్ మూవీకి లైన్ క్లియర్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం కావలిసి ఉన్నా ఈసినిమాకు సంబంధించిన కథ విషయంలో మహేష్ సుకుమార్ ల మధ్య ఏర్పడ్డ గందరగోళం కొంత కన్ఫ్యూజన్ కు దారితీసింది. 
Mahesh Babu and Sukumar
ఇలాంటి పరిస్థుతులలో సుకుమార్ మహేష్ కోసం తెలంగా బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఒక పవర్ ఫుల్ స్టొరీ తాయారుచేయడం ఆస్టొరీకి మహేష్ అంగీకారం పొందడం జరిగి పోయింది అని వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ చరణ్ చేత 1980 కాలంనాటి కధలో నటింప చేస్తే ఇప్పుడీ సుకుమార్ మహేష్ చేత 1900 కాలంనాటి కధలో నటింప చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Mahesh Babu and Rangasthalam director Sukumar to team up again?
నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా 1900 సంవత్సరం ప్రాంతాలలో పోరాడిన ఒక వీరుడు కధను మహేష్ తో తీయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారిన పరిస్థుతులలో గత చరిత్రకు సంబంధించిన కధలతో తీసిన సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడుతున్న నేపధ్యంలో సుకుమార్ మహేష్ ను ఈ ప్రయోగానికి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని మహేష్ డైలాగ్స్ అన్ని తెలంగాణా ప్రాంత మండలీకంలో ఉండబోతున్నట్లు టాక్. 
Bharat Ane Nenu Targeting $3 Million Weekend
మహేష్ ఇప్పటివరకు నటించిన ఏసినిమాలోను పోరాట యోధుడు పాత్ర పోషించలేదు. దీనికితోడు ఈమధ్య ప్రేక్షకులు తెలంగాణా యాసతో ఉండే డైలాగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న నేపధ్యంలో మహేష్ లాంటి క్రేజీ హీరో నోటివెంట తెలంగాణా యాసకు సంబంధించిన డైలాగ్స్ వస్తే థియేటర్స్ దద్దరిల్లి పోవడం ఖాయం. ఇప్పటికే విజయ్ దేవరకొండ తన ప్రత్యేక మైన డైలాగ్స్ మాడ్యూలేషన్ తో తెలంగాణా సూపర్ స్టార్ గా మారిన నేపధ్యంలో ఇప్పడు మహేష్ ఈ తెలంగాణా పోరాట యోధుడు పాత్ర ద్వారా తెలంగాణాలో తన అభిమానుల సంఖ్యను మరింత పెంచుకునే ఛాన్స్ ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: