‘అరవింద సమేత’ మూవీ తమ భాషను జీవితాలను కించపరిచేలా ఉందని ఇటీవల హైదరాబాద్‌ లో కొందరు యువకులు ప్రెస్‌ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరు ఒక ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడితో ఆ వివాదం సంచలనంగా మారడంతో నేడు మరో ఛానల్‌లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం రావడంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయువకులు వారి రాయలసీమ ప్రాంతం  నుంచి హైదరాబాద్‌ కు బయలుదేరారు. 

అయితే మార్గమధ్యంలో జరిగిన ఘోర ప్రమాదం ఆ యువకులలో ఒకరు చనిపోగా మరో ముగ్గురు తీవ్రగాయాలపాలై చికిత్స తీసుకుంటున్నట్టువార్తలు వస్తున్నాయి. హాట్ టాపిక్ గామారిన ఈన్యూస్ వివరాలలోకి వెళ్లితే జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డి అనే యువకులు ‘అరవింద సమేత’ సినిమాలో తమ భాషను తమ ప్రాంత జీవితాల్ని కించపరిచారనేవిషయం పై పోరాటం చేస్తున్నారు.   

వీరి పోరాటాన్నిమరింత ఉధృతం చేయడానికి వారు మళ్ళీ ఒక ఛానెల్ చర్చా గోష్టి కోసం వస్తున్న నేపధ్యంలో వీరు  హైవే పై ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగడంతో వీరు ప్రయాణిస్తున్న కారు  నుజ్జునుజ్జు అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడకు అక్కడే చనిపోగా మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు అని ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు సంబంధించిన మీడియా సంస్థ న్యూస్ ను షేర్ చేస్తోంది. దీనితో ఒక సినిమా లోని సన్నివేసాల గురించి పోరాటం చేస్తూ యువకులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నారు అని వార్తలు రావడం అత్యంత భాధాకరం గామారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: