చిరంజీవి అంటే కాంగ్రెస్ నాయకుడు అతను ఆ పార్టీ లో యాక్టీవ్ గా లేకపోయినప్పటికీ అదే పార్టీ లో కొనసాగుతున్నాడు. అయితే  తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయాలని స్వయంగా రాహుల్ గాంధీనే చిరంజీవికి ఆహ్వానం పంపినా ఆయన పట్టించుకోలేదు. తాజాగా సభ్యత్వం పునరుద్ధరించుకోకుండా కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండానే ఆయన బైటపడ్డారు. ఆ విధంగా తాను కాంగ్రెస్ సభ్యుడిని ఇక ఎంతమాత్రం కాదని అభిమానులకు సంకేతాలిచ్చారు. 

తమ్ముడి కోసం చిరు మెగా డ్రామా

ఈ ఏడాది ఏప్రిల్-2తో చిరు రాజ్యసభ సభ్యత్వం పూర్తవడంతోనే కాంగ్రెస్ తో ఆయన రుణానుబంధం ముగిసింది.150వ సినిమాతో మళ్లీ తానేంటో నిరూపించుకున్న చిరంజీవికి రాజకీయాల కంటే సినిమాలే బాగున్నట్టు అనిపించాయి. అందుకే వెంటనే సైరాకి సై అన్నారు. అదీకాక పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో తెగతెంపులు చేసుకుని సొంతగా జనసేన యాక్టివిటీని పెంచారు. దీంతో చిరంజీవి జనసేనకి వ్యతిరేకంగా తాను రాజకీయాల్లో కొనసాగడం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగితే జనసేనకి వ్యతిరేకంగా పనిచేయాలి.

Image result for chiranjivi and pavan

చిరు నిర్ణయానికి తగ్గట్టుగానే ఇటీవల వరుస పరిణామాలు జరిగాయి. స్వయంగా పవన్ కల్యాణ్ కుటుంబంతో సహా అన్న ఇంటికి వెళ్లారు. తామిద్దరం  ఒకటే అని అభిమానులకు సంకేతాన్నిచ్చారు. మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా కాంగ్రెస్ కి దూరం జరిగి జనసేనతో కలసి పనిచేస్తున్నారు. మొన్నజరిగిన కవాతులో బన్నీవాసు నేతృత్వంలో జనసైనికులతో పాటు మెగాసైన్యం కూడా కదిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: